Mallikarjun Kharge on PM Modi: వచ్చే  సంవత్సరం ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై కాకుండా.. తన ఇంటిపై జెండాను ఎగురవేస్తారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే జోస్యం చెప్పారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తాము గెలుపొందడం ఖాయమని.. వచ్చే ఏడాది మళ్లీ ఈ ఎర్రకోటపై నుంచి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తానని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పగా.. ఈ వ్యాఖ్యలకు ఖర్గే కౌంటర్ ఇచ్చారు. వచ్చే ఏడాది కూడా ప్రధాని మోదీ జెండా ఎగురవేస్తారని.. అయితే ఎర్రకోటపై కాకుండా తనపైనే ఎగురవేస్తారని అన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోటలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతోపాటు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గైర్హాజరయ్యారు. అక్కడ ఖర్గే కోసం ఏర్పాటు చేసిన కూర్చీగా ఖాళీగా దర్శనమిచ్చింది. ఈ కార్యక్రమానికి హాజరుకాలేకపోయిన ఆయన.. తన కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఎర్రకోటలో జరిగిన ఇండిపెండెన్స్ డే వేడుకలకు దూరంగా కావడంపై క్లారిటీ ఇచ్చారు. తనకు కంటికి కొంత సమస్య ఉందని.. ప్రోటోకాల్ ప్రకారం ఉదయం తన నివాసంలో జెండాను ఎగురవేయాలని అన్నారు. అనంతరం కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జెండా ఎగురవేయాల్సి వచ్చిందన్నారు. ప్రధాని వెళ్లేలోపు ఎవరినీ వెళ్లనివ్వనంత కట్టుదిట్టమైన భద్రత ఉందని.. తాను అక్కడికి వెళ్లి ఉంటే ఇక్కడ జరిగే కార్యక్రమానికి హాజరుకాలేకపోయేవాడినని చెప్పారు.


మొదట తన నివాసంలో జెండాను ఎగురవేసిన మల్లికార్జున ఖర్గే.. తరువాత కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జెండాను ఎగురవేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ హయాంలో ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి, సంస్థలకు ముప్పు పొంచి ఉందని అన్నారు. ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్ (ఇండియా) కూటమి అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడి గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ మళ్లీ అధికారంలోకి వస్తున్నామని అంటున్నారని.. గెలిపించడం లేదా ఓడిపోవడం ప్రజల చేతుల్లో ఉందని అన్నారు. 


అంతకుముందు దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోటపై మువ్వన్నెల జెండా ఎగురవేసిన ప్రధాని మోదీ.. త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా దేశ ప్రజలందరీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రపంచదేశాలు అన్ని భారత్ వైపు చూస్తున్నాయని అన్నారు. గత పదేళ్లలో మన దేశం ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు. ప్రపంచంలోని ఏ శక్తికీ భారత్ భయపడదని.. తలవంచదని స్పష్టం చేశారు. సమున్నత లక్ష్యాలతో అభివృద్ధి సాధిస్తోందని అన్నారు. దేశ సరిహద్దులను పరిరక్షించడంతో పాటు ఏ యుద్ధానికైనా దేశ సైన్యం సన్నద్ధంగా ఉందన్నారు. 


Also Read: Independence Day Celebrations: అన్ని సేవలు ఇంటి వద్దకే.. గ్రామ స్వరాజ్యం తీసుకువచ్చాం: సీఎం జగన్   


Also Read: Wanindu Hasaranga: స్టార్ ఆల్‌రౌండర్ వనిందు హసరంగా సంచలన నిర్ణయం.. టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌ బై..!  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి