Congress Crisis: కాంగ్రెస్‌లో కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. గులాం నబీ ఆజాద్ మరోసారి ట్రబుల్ షూటర్ పాత్ర పోషిస్తున్నట్టు కన్పిస్తోంది. అహ్మద్ పటేల్ స్థానాన్ని గులాం భర్తీ చేయనున్నారా..ఇదే ఇప్పుడు ఆసక్తిగా మారింది. అసమ్మతి నేతల్ని చల్లబర్చేందుకు చేసిన ప్రయత్నం ప్రాధాన్యత సంతరించుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కాంగ్రెస్ అధినాయకత్వంపై గతంలో పలు ప్రశ్నలు లేవనెత్తిన ఆ పార్టీ సీనియర్ నేత, ట్రబుల్ షూటర్ గులాం నబీ ఆజాద్ మరోసారి రంగంలో దిగారు. దేశంలో జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల అనంతరం నెలకొన్న పరిస్థితులపై దృష్టి సారించారు. కాంగ్రెస్ పరాజయం నేపధ్యంలో పార్టీ నాయకత్వంపై రెబెల్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా జీ 23 వరుస భేటీలు నిర్వహించారు. గత కొద్దికాలంగా పార్టీ కార్యకలాపాల పట్ల సైలెంట్‌గా ఉన్న గులాం నబీ ఆజాద్ ఒక్కసారిగా యాక్టివ్ అయ్యారు. పార్టీలో నెలకొన్న అసమ్మతి రాగాల్ని నియంత్రించేందుకు రంగంలో దిగిన ఆజాద్..వరుస భేటీలు నిర్వహించారు. ఆ ప్రయత్నంలో దాదాపుగా సఫలమైనట్టే తెలుస్తోంది. పార్టీలో గులాం నబీ ఆజాద్‌కు ట్రబుల్ షూటర్‌గా పేరుంది. వివిధ రాష్ట్రాల ఇన్‌ఛార్జ్‌గా చేసిన గులాం నబీ ఆజాద్‌కు ఆ అనుభవం కూడా ఉంది. 


కాంగ్రెస్ అసమ్మతి నేతలైన జీ 23తో గత వరుసగా రెండ్రోజులు ఆజాద్ తన నివాసంలో భేటీ అయ్యారు. ఎన్ని సమస్యలు, ఎన్ని బేధాభిప్రాయాలున్నా సరే నాయకులంతా కలుపుకుని పోవాలని అధిష్టానానికి సీనియర్ నేతలు సూచించినట్టు సమాచారం. అందరి అభిప్రాయలు తెలుసుకున్న ఆజాద్..ఆ నేతల్లో ఉన్న అసంతృప్తిని చల్లార్చినట్టు సమాచారం. పార్టీలో సీనియర్ నేతగా, సోనియా గాంధీకు అత్యంత విధేయుడిగా ఉన్న అహ్మద్ పటేల్ మరణానంతరం ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు గులాం నబీ ఆజాద్ ప్రయత్నిస్తున్నట్టు కన్పిస్తోంది. అందుకే ఇంతకాలం కాస్త దూరంగా ఉన్న ఆజాద్..ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పరాజయం అనంతరం రంగంలో దిగారని తెలుస్తోంది. 


అసమ్మతి నేతలతో సమావేశాల అనంతరం గులాం నబీ ఆజాద్ నేరుగా పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో సమావేశమయ్యారు. పార్టీకు సంబంధించిన అంతర్గత వ్యవహారాలు, జీ23 వరుస భేటీల్లో వ్యక్తమైన అభిప్రాయాలపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన గులాం నబీ ఆజాద్..ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోనియా గాంధీతో సమావేశం బాగా జరిగిందని..పార్టీ బలోపేతంపై సూచనలిచ్చానని చెప్పారు. కాంగ్రెస్ నాయకత్వాన్ని మార్చాల్ని అవసరం లేదని చెప్పారు. సోనియా గాంధీ నేతృత్వంలోనే ముందుకు సాగేందుకు అందరూ సుముఖంగా ఉన్నారని చెప్పారు. పార్టీ సభ్యులంతా సోనియా గాంధీనే అధ్యక్షురాలిగా కొనసాగించేందుకు ఏకగ్రీవంగా నిర్ణయించారని చెప్పారు. 


వాస్తవానికి కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి నేతల స్వరం 2020 ఎన్నికల్లో పరాజయం తరువాత ప్రారంభమైంది. అప్పుడే తొలిసారిగా సోనియా గాంధీకి జి 23 లేఖాస్త్రాన్ని సంధించారు. మొన్న జరిగిన జీ 23 సమావేశంలో కూడా హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా రాహుల్ గాంధీని కలిసి పలు అంశాలపై చర్చించారు. పార్టీలో ఎవరు నిర్ణయాలుతీసుకుంటున్నారనే విషయంపై స్పష్టత కావాలని కోరారు. సమిష్టిగా నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. పార్టీలో తలెత్తిన పరిణామాల్ని గత కొద్దికాలంగా నిశితంగా గమనిస్తున్న గులాం నబీ ఆజాద్..రంగంలో దిగి..మరోసారి ట్రబుల్ షూటర్‌గా మారారు. 


Also read: Prostitution Racket: గోవాలో వ్యభిచార దందా బట్టబయలు.. టీవీ నటి సహా ముగ్గురికి విముక్తి...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook