Rahul Gandhi Padayatra: దక్షిణ భారతదేశం నుంచి ఉత్తర భారతదేశానికి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన భారత్ జోడో పాదయాత్ర విజయవంతం కావడంతో ఇప్పుడు తూర్పు నుంచి పశ్చిమానికి భారత్ న్యాయయాత్రపేరుతో మరో పాదయాత్ర మొదలుపెట్టనున్నారు. ఏఐసీసీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అధికారికంగా రాహుల్ గాంధీ పాదయాత్ర వివరాలు వెల్లడించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బీజేపీ విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా దేశ ప్రజల్ని ఏకం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ బారత్ జోడో యాత్ర దక్షిణాదిన కన్యా కుమారి నుంచి ఉత్తరాదిన కశ్మీర్ వరకూ కొనసాగింది. 145 రోజుల పాటు 12 రాష్ట్రాలు కవర్ చేస్తూ 4500 కిలోమీటర్ల పాదయాత్ర జరిగింది. ఇప్పుుడు తూర్పు భారతదేశం నుంచి పశ్చిమ భారతదేశానికి భారత్ న్యాయ్ యాత్ర పేరుతో హైబ్రిడ్ మోడల్‌లో యాత్ర జరగనుంది. అంటే బస్సు. కాలినడక రెండూ ఉంటాయి. రెండవ విడత యాత్ర ఏకంగా 14 రాష్ట్రాలు కవర్ చేస్తూ ఏకంగా 6,200 కిలోమీటర్ల మేర సాగనుంది. 


జనవరి 14వ తేదీన మణిపూర్ రాజధాని ఇంఫాల్ నుంచి ప్రారంభమై మార్చ్ 20వ తేదీన ముంబైలో భారత్ న్యాయ్ యాత్ర ముగియనుంది. ఈ యాత్ర ద్వారా రాహుల్ గాంధీ మణిపూర్, నాగాలాండ్, అస్సోం,  మేఘాలయ, పశ్చిమ బెంగాల్, జార్ఘండ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్రలు కవర్ చేయనున్నారు. మొత్తం ఈ 14 రాష్ట్రాల్లో 85 జిల్లాల మీదుగా రాహుల్ గాంధీ యాత్ర కొనసాగనుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే జెండా ఊపి యాత్రను ప్రారంభిస్తారు. 


భారత్ న్యాయ్ యాత్ర ద్వారా రాహుల్ గాంధీ సామాజిక, రాజకీయ, ఆర్ధిక న్యాయంపై ప్రధానంగా దృష్టి సారించనున్నట్టు కేసీ వేణుగోపాల్ తెలిపారు. 


Also read: Coronavirus Spread: పెరుగుతున్న కరోనా సంక్రమణ, గత 24 గంటల్లో ఆరుగురు మృతి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook