Ghulam Nabi Azad : 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం కష్టం
Can`t see Congress securing 300 seats in 2024 Lok Sabha polls : 2024 ఎలక్షన్స్‌లలో కాంగ్రెస్ 300 స్థానాల్లో విజయం సాధించాలని తాను కోరుకుంటున్నానని కాంగ్రెస్ సీనియర్ నేత, జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం గులాంనబీ ఆజాద్ పేర్కొన్నారు. అయితే ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే కాంగ్రెస్ అన్ని సీట్లలో గెలిచే అవకాశం లేదని గులాంనబీ ఆజాద్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
Congress's Ghulam Nabi Azad's 2024 Lok Sabha polls Assessment : 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం కష్టమంటూ ఆ పార్టీ నేత చెప్పారు. కాంగ్రెస్ సీనియర్ నేత, జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం గులాంనబీ ఆజాద్ (Congress leader Ghulam Nabi Azad) ఈ స్టేట్‌మెంట్ ఇచ్చారు. కాంగ్రెస్ 300 స్థానాల్లో విజయం సాధించి దేశంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితులు కనిపించడం లేదన్నారు.
జమ్మూ కశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో ఆయన తాజాగా మాట్లాడారు. జమ్మూ కశ్మీర్‌లోని భూమిలను.. ఉద్యోగాలను కాపాడుకోవడమే తమ ప్రధాన ఎజెండా అని వెల్లడించారు. ఆర్టికల్ 370పై (Article 370) ఎన్నో ఏళ్ల నుంచి పార్లమెంటులో (Parliament) తాను ఒక్కడినే మాట్లాడానని చెప్పారు.
Also Read : Breaking News: దేశంలో రెండు ఒమిక్రాన్ కేసులు.. రెండు కేసులు కర్ణాటకలోనే నమోదు!
ఇక అయితే ప్రస్తుతం ఈ విషయం న్యాయస్థానం పరిధిలో ఉండడంతో తాను దానిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయనని చెప్పుకొచ్చారు. ఇక 2024 ఎలక్షన్స్‌లలో (2024 Lok Sabha polls) కాంగ్రెస్ 300 స్థానాల్లో (300 seats)
విజయం సాధించాలని తాను కోరుకుంటున్నానని పేర్కొన్నారు.అయితే ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే కాంగ్రెస్ అన్ని సీట్లలో గెలిచే అవకాశం లేదని గులాంనబీ ఆజాద్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక జమ్మూ కశ్మీర్‌లో (Jammu and Kashmir) అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకుగానూ కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. ఈ మేరకు అన్ని పక్షాలు ఏకం కావాలని కోరారు.
Also Read : Inthandanga untundha song: ఇంతందంగా ఉంటుందా ఈ లోకం సాంగ్ విడుదల
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook