Congress President Election: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో ఇద్దరు సీనియర్ నేతల మధ్య పోటీ ఉండబోతోంది. ఈపదవికి ముగ్గురు నేతలు నామినేషన్లు వేశారు. ఇందులో ఒకరి నామినేషన్ తిరస్కరణకు గురవడంతో ఇద్దరి మధ్యే పోటీ ఉండనుంది. ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల్లో మల్లికార్జున్ ఖర్గే, శశిథరూర్, మరో సీనియర్ నేత కేఎన్ త్రిపాఠి నామినేషన్లు వేశారు. వీటిని కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సంతకాల్లో లోపం కారణంగా కొన్ని పత్రాలను తిరస్కరించారు. ఈనేపథ్యంలో కేఎన్ త్రిపాఠి నామినేషన్‌ తిరస్కరణకు గురైంది.  ఆయన పోటీ నుంచి తప్పుకున్నారు. దీంతో మల్లికార్జున్ ఖర్గే, శశిథరూర్ మధ్య పోటీ ఉండబోతోందని తేలిపోయింది. వీరిద్దరే పోటీలో ఉంటారని ఎన్నికల అధికారులు ప్రకటించారు. నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు అక్టోబర్ 8 వరకు సమయం ఉంది.


ఆ తర్వాతే ఎన్నికలు జరుగుతాయా..లేక ఏకగ్రీవం అవుతుందా అన్న దానిపై క్లారిటీ రానుంది. అప్పటిలోపు నామినేషన్‌ను ఎవరూ  ఉపసంహరించుకోకపోతే ఈనెల 17న ఎన్నికల అనివార్యం కానుంది. 19న ఫలితాలు రానున్నాయి.  9 వేల వంద మంది నేతలు ఓటు వేయనున్నారు. ఐతే ఏఐసీసీ చీఫ్ పదవి ఏకగ్రీవం కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. శశిథరూర్ పోటీ నుంచి తప్పుకోనున్నట్లు తెలుస్తోంది.


ఆయన తప్పుకుంటే మల్లికార్జున్ ఖర్గే ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఖర్గేకు సోనియా, రాహుల్ గాంధీ అండ ఉంది. వారికి అప్తమిత్రుడుగా ఉన్నారు. దీంతో ఆయన ఎన్నికల ఏకగ్రీవం కానుందని ప్రచారం జరుగుతోంది. మరోవైపు శుక్రవారం ఆ పార్టీలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంది. మరో సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ పోటీ నుంచి తప్పుకున్నారు. ఖర్గేకు ఆయన మద్దతు ఇచ్చారు. 


ఇటు రాజ్య సభ పదవికి ఖర్గే రాజీనామా చేశారు. ఒక వ్యక్తికి..ఒకే పదవి అన్న నిబంధనతో తన పదవికి రాజీనామా చేశారు. దీంతో సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గేనే చీఫ్ కానున్నారని స్పష్టంగా అర్థమవుతోంది. త్వరలో శశిథరూర్ సైతం నామినేషన్‌ను ఉపసంహరించుకోనున్నట్లు తెలుస్తోంది. దీనిపై అక్టోబర్ 8న క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఖర్గేనే బాస్‌ కావాలని పార్టీ నేతల సైతం ఆకాంక్షిస్తున్నారు. 


[[{"fid":"247108","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


Also read:TDP Twitter: మరోమారు టీడీపీ ట్విట్టర్ ఖాతా హ్యాక్..చంద్రబాబు సీరియస్..!  


Also read:IND vs SA: టీమిండియాకు మరో జహీర్‌ ఖాన్‌ దొరికాడు..అర్ష్‌దీప్‌పై పాక్ మాజీ ప్లేయర్ ప్రశంసలు..!  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి