Leena Manimekalai Controversial Kaali Poster: ప్రముఖ ఫిలిం మేకర్ లీనా మణిమెకలై ఇటీవల విడుదల చేసిన 'కాళీ' డాక్యుమెంటరీ ఫిలిం పోస్టర్ వివాదాస్పదమవుతోంది. ఈ పోస్టర్‌లో కాళీ మాత సిగరెట్ తాగుతున్నట్లుగా చూపించడంపై హిందూ సంఘాలు భగ్గుమంటున్నాయి. అంతేకాదు, కాళీ మాత చేతిలో స్వలింగ సంపర్కుల కమ్యూనిటీకి చెందిన జెండా ఉండటంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ పోస్టర్‌తో హిందువుల మనోభావాలను కించపరిచిన డైరెక్టర్ లీనా మణిమెకలైని అరెస్ట్ చేయాలని ట్విట్టర్‌లో నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.ప్రస్తుతం కాళీ పోస్టర్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సినిమాను కెనడాలోని ఆగా ఖాన్ మ్యూజియంలో రిథమ్స్ ఆఫ్ కెనడా ఈవెంట్ సందర్భంగా ప్రదర్శిస్తున్నట్లు లీనా మణిమెకలై ఈ నెల 2న ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. చిత్ర ప్రదర్శనను కూడా నిలిపివేయాలని హిందూ సంఘాలు, నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. లీనాపై ఇప్పటికే ఢిల్లీలో ఐపీసీ సెక్షన్ 153 ఏ, 295 ఏ కింద కేసు కూడా నమోదైంది.


వివాదంపై లీనా మణిమెకలై రియాక్షన్ :


కాళీ డాక్యుమెంటరీ ఫిలిం పోస్టర్‌పై జరుగుతున్న వివాదంపై లీనా మణిమెకలై ఘాటుగా స్పందించారు. 'ఇండియాలో సామాజిక రాజకీయ పరిస్థితులు ఎంతలా దిగజారిపోతున్నాయో ఇది అద్దం పడుతోంది. దేశం విద్వేషం, మతోన్మాదంలో కూరుకుపోతోంది. ఈ మూర్ఖపు మూక మాఫియాకు భయపడి నేను నా స్వేచ్చను వదులుకోను. ఏం జరుగుతుందో జరగనివ్వండి.. నేను ఆ పోస్టర్‌ను అలాగే ఉంచుతా..' అని లీనా మణిమెకలై పేర్కొన్నారు. ప్రస్తుతం దేశాన్ని పాలిస్తున్న హిందుత్వ ఛాందసవాదుల మద్దతు ఈ విద్వేషకారులకు ఉందని అన్నారు. వారి లక్ష్యం ప్రజలను విభజించి ఓట్లు దండుకోవడమేనని ఫైర్ అయ్యారు. వీళ్లే దేశంలోని జర్నలిస్టులు,కళాకారులను వెంటాడుతున్నారని, మైనారిటీల మారణహోమానికి పాల్పడుతున్నారని ఆరోపించారు.


ఎవరీ లీనా మణిమెకలై : 


తమిళనాడులోని మధురైకి చెందిన లీనా మణిమెకలై ప్రస్తుతం కెనడాలోని టొరంటోలో ఉంటున్నారు. ఆమె కవి, నటి, ఫిలిం మేకర్ కూడా. ఇప్పటివరకూ ఐదు కవిత్వ సంపుటాలు, పదుల సంఖ్యలో డాక్యుమెంటరీ సినిమాలు తీశారు. ఇందులో ఫిక్షన్‌తో పాటు ప్రయోగాత్మక చిత్రాలు ఉన్నాయి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు కూడా అందుకున్నారు. లీనా తెరకెక్కించిన డాక్యుమెంటరీల్లో మహాత్మా, పరాయ్, లవ్ లాస్ట్, ఏ హోల్ ఇన్ ది బకెట్ తదితర చిత్రాలకు మంచి గుర్తింపు వచ్చింది. లీనా సొంతంగా లీనా మణిమెకలై ప్రొడక్షన్స్ సంస్థను కూడా నిర్వహిస్తున్నారు.



Also Read: Nayanathara - vignesh shivan: చెన్నైలోని పోష్ ఏరియాలో రెండు బంగ్లాలు కొన్న నయనతార..


Also Read: Teegala VS Sabitha: టీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్.. మంత్రి సబితపై తీగల డైరెక్ట్ అటాక్.. కాంగ్రెస్ లోకి జంప్?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook