Coromandel Express Train Accident: కోరమండల్ ట్రైన్ యాక్సిడెంట్ లో 233 మంది చేసిన మృతుల సంఖ్య.. 900 మందికి పైగా క్షతగాత్రులు
Coromandel Express Train Accident: ఒడిషాలో.. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతాకు సమీపంలోని షాలిమార్ నుంచి తమిళనాడులోని చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ కి బయల్దేరిన కోరమండల్ ఎక్స్ ప్రెస్ ట్రెయిన్ మరో గూడ్స్ రైలుని ఢీకొట్టింది. ఈ క్రమంలో 233 మంది మరణించగా.. 900కి పైగా గాయపడ్డారు.. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.
Update on Coromandel Express Train Accident: ఒడిషాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 50 మంది వరకు మృతి చెందగా మరో 350 మందికిపైగా ప్రయాణికులు గాయపడ్డారని రైల్వే శాఖ అధికారులు తెలిపారు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాకు సమీపంలోని షాలిమార్ నుంచి తమిళనాడులోని చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్‌కి బయల్దేరిన కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ట్రెయిన్ మరో గూడ్స్ రైలుని ఢీకొట్టింది. ఒడిషాలోని బాలాసూర్ జిల్లా బహనగ బజార్ రైల్వే స్టేషన్ సమీపంలో శుక్రవారం రాత్రి ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
ఒడిషా రైలు ప్రమాదం దుర్ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తంచేశారు. మృతులు కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపం ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ.. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుడిని ప్రార్ధించారు. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో మాట్లాడానని.. ఘటనా స్థలంలో సహాయ కార్యక్రమాలు నిరాటంకంగా జరగుతున్నాయని అన్నారు. కేంద్రం వైపు నుంచి అన్నిరకాల సహాయం అందిస్తున్నట్టు ప్రధాని మోదీ తన ట్వీట్ లో స్పష్టంచేశారు.
తొలుత అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం 179 మంది వరకు గాయపడినట్టు తెలిసినప్పటికీ.. వాస్తవానికి ఆ సంఖ్య 350కి పైనే ఉంది అని అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో బోగీలు ఎగిరిపడటంతో అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు కూడా చెల్లాచెదురుగా పడిపోయారు. పదుల సంఖ్యలో ప్రయాణికులు బోగీల్లో చిక్కుకుపోయారు.
ఆగి ఉన్న గూడ్స్ రైలుని కోరమండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొన్న ఘటనలో ఎక్స్‌ప్రెస్ రైలుకి చెందిన నాలుగు బోగీలు పట్టాలు తప్పి బయటికి ఎగిరిపడ్డాయి. గాయపడిన ప్రయాణికులను బాలాసోర్ మెడికల్ కాలేజీకి, సోరో, గోపాల్‌పూర్‌లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్, ఖాంతపాడలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అన్నీ ఆస్పత్రుల్లో కలిపి దాదాపు 179 మందికి చికిత్స అందిస్తుండగా.... వారిలో 30 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.
రైలు బోగీల్లో చిక్కుకుపోయిన క్షతగాత్రులను సురక్షితంగా వెలికి తీసేందుకు సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. మరోవైపు తీవ్ర గాయాలపాలైన ప్రయాణికుల ఆర్తనాదాలతో ఘటనా స్థలం బీతావహంగా మారింది. ఈ దుర్ఘటనపై రైల్వే శాఖ పలు జంక్షన్ల కేంద్రాలుగా హెల్ప్ లైన్స్ ఏర్పాటు చేసింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook