Corona Updates in India: భారత్‌లో గతకొంతకాలంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో పాజిటివిటీ రేటు ఆందోళనకరంగా కనిపిస్తోంది. ఏడు రాష్ట్రాల్లో పాజిటివిటీ రేటు 10 శాతం దాటుతోంది. దీంతో మోదీ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో పాజిటివిటీ రేటు రెట్టింపు అవుతోంది. వీకెంట్ సమయంలో కేసుల పెరుగదల కనిపిస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈనేపథ్యంలో ఆయా రాష్ట్రాల ఆరోగ్య కార్యదర్శులకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్‌ భూషణ్‌ లేఖలు రాశారు. వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు పక్క వ్యూహాంతో ముందుకు వెళ్లాలని సూచించారు. అర్హులైన ప్రజలందరికీ టీకా అందించాలన్నారు. కోవిడ్ నిబంధనలు, మార్గదర్శకాలు అమలు అయ్యేలా చూడాలని తెలిపారు. రాబోయే పండగ రోజుల్లో సామూహిక కార్యక్రమాలు జరుగుతాయని..వీటి వల్ల కేసులు పెరిగే అవకాశం ఉందని..అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 


దేశంలో తాజాగా 3.91 లక్షల మందికి కరోనా పరీక్షలు చేయగా..19 వేల 406 కేసులు వెలుగులోకి వచ్చాయి. వైరస్ వల్ల 49 మంది మృత్యువాత పడ్డారు. పాజిటివిటీ రేటు 4.96 శాతంగా ఉంది. గడిచిన 24 గంటల్లో 19 వేల 928 మంది కరోనాను జయించారు. ప్రస్తుతం దేశంలో లక్షా 34 వేల 793 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయి. మొత్తం కేసుల్లో దేశ రాజధాని ఢిల్లీలో 2 వేల 419 కేసులు బయట పడ్డాయి. మరోవైపు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. 




Also read:Janasena: ఏపీలో స్పీడ్ పెంచిన జనసేన..త్వరలో కీలక నేతల చేరికలు..!


Also read:CM KCR LIVE UPDATES: ఇక కేంద్రంతో యుద్దమే..సీఎం కేసీఆర్ స్పష్టీకరణ..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook