SDSC-SHAR: అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) లోని నెల్లూరు జిల్లా శ్రీహరికోట ( sriharikota ) లోని సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధనా కేంద్రం (SDSC-SHAR) లో లాక్‌డౌన్‌ను విధించారు. షార్‌లో పనిచేస్తున్న పలువురికి కరోనావైరస్ ( Coronavirus ) సోకడంతో అధికారులు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. అయితే నమోదైన పాటిజివ్ కేసుల్లో  ఇద్దరు సిబ్బంది ఉండగా.. మరో ఇద్దరు వారి కుటుంబ సభ్యులు ఉన్నారు. Also read: Telangana: టెన్త్, ఇంటర్ పాస్.. ఆపై డాక్టర్లుగా!


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ మేరకు తదుపరి ఆదేశాలు వచ్చే వరకు షార్‌లో లాక్‌డౌన్‌ కొనసాగుతుందని అధికారులు తెలిపారు. వాటర్‌, కరెంట్‌, ఫైర్‌ అవసరాలు మినహా అన్ని సేవలను బంద్‌ చేయనున్నారు. అలాగే ఆ ప్రాంతం మొత్తాన్ని శానిటైజింగ్ చేస్తున్నారు. Also read: Covid-19: భారత్‌లో 11 లక్షలు దాటిన కరోనా కేసులు


కరోనా సోకిన ఇద్దరు ఉద్యోగులు విధులకు హాజరుకావడంతో షార్ అంతటా గందరగోళం నెలకొంది. మరికొంతమందికి కూడా ఈ వైరస్ సోకి ఉండవచ్చని అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఈ మేరకు కరోనా సోకిన వారితో ఉన్న కాంటాక్ట్‌లను గుర్తించి పరీక్షలు చేయిస్తున్నారు.    Also read: Andhra Pradesh: గ్రామ, వార్డు సచివాలయం పరీక్షలు వాయిదా