Coronaprecautions: ఇవి పాటిస్తే కరోనా మీ దరిచేరదు...
కరోనా వైరస్ (Coronavirus) మహమ్మారి నివారించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మూడు వారాల పాటు ఏప్రిల్ 21 వరకు లాక్ డౌన్‌ను ప్రకటించాయి. కరోనా వైరస్ సంక్రమణ నివారణకు పలువురు నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. అయినప్పటికీ దేశవ్యాప్తంగా అక్కడక్కడ నిర్లక్ష్య ధోరణి కనిపిస్తోంది. లాక్ డౌన్ కారణంగా అందరూ తమ స్వీయనియంత్రణలో ఉంటున్న నేపథ్యంలో కరోనా నియంత్రణకు పలు సూచనలు పాటించాలని పేర్కొంటున్నారు.
హైదరాబాద్: కరోనా వైరస్ (Coronavirus) మహమ్మారి నివారించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మూడు వారాల పాటు ఏప్రిల్ 21 వరకు లాక్ డౌన్‌ను ప్రకటించాయి. కరోనా వైరస్ సంక్రమణ నివారణకు పలువురు నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. అయినప్పటికీ దేశవ్యాప్తంగా అక్కడక్కడ నిర్లక్ష్య ధోరణి కనిపిస్తోంది. లాక్ డౌన్ కారణంగా అందరూ తమ స్వీయనియంత్రణలో ఉంటున్న నేపథ్యంలో కరోనా నియంత్రణకు పలు సూచనలు పాటించాలని పేర్కొంటున్నారు.
Photos: బికినీలో ‘సాహో’ బ్యూటీ
వేడి నీళ్లు ఎక్కువ తాగడం, వేడి నీళ్లు గొంతులో పోసుకుని పుక్కిలించడం, వేడి నీళ్లలో పసువు కలుపుకుని తాగడం, వేడి ద్రవపదార్థాలు తాగాలని పేర్కొంటున్నారు. ప్రతిఒక్కరు తమ రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవాలని, అందుకోసం విటమిన్ సి, సిట్రస్ ఎక్కువగా ఉండే ఫలాలు తీసుకోవాలని సూచిస్తున్నారు. నిత్యావసర సరుకులు తీసుకోవడానికి బయటకి వెళ్లినప్పుడు మళ్లీ ఇంటికి వచ్చినప్పుడు గేటు హ్యాండిల్ గానీ, డోర్ హ్యాండిల్ గానీ పట్టుకోవద్దని, నేరుగా వాష్‌రూంకు వెళ్లి సబ్బుతో తలస్నానం చేయాలని చెబుతున్నారు. అలాగే ఐస్ క్రీం, కూల్ డ్రింక్స్ వంటి చల్లటి వస్తువులు ఏమీ తీసుకోవద్దని సూచించారు.
Read also : అసలు నిజం దాచిన కంపెనీ.. 17 మందికి కరోనా.. సంస్థపై కేసు నమోదు
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో అందరూ ఇంట్లోనే ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని చెబుతున్నారు. రోజులో చాలా సార్లు సబ్బుతో 20 నుంచి 30 సెకన్ల పాటు చేతులను శుభ్రంగా కడుక్కోవాలని పేర్కొంటున్నారు.(బుల్లితెర భామ టాప్ Bikini Photos ) మీ ముఖాన్ని చేతులతో తాకవద్దు, ముఖ్యంగా కళ్లు, ముక్కు, నోటి భాగాలకు తాకరాదని, దగ్గుతున్నప్పుడు, తుమ్ముతున్నప్పుడు మీ ముఖానికి మో చేతులు అడ్డం పెట్టుకోవాలని సూచిస్తున్నారు. సామాజిక దూరం పాటిస్తూ ఇతరులతో కనీసం మూడు మీటర్ల దూరం పాటించాలని చెబుతున్నారు. ఎవరికైనా కరోనా లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
Read Also: విద్యార్థులకు ఆన్‌లైన్‌లో క్లాసెస్.. రేషన్ డీలర్లకు సీఎం వార్నింగ్!