India Corona update: దేశంలో కరోనా సెకండ్ వేవ్ భయంకరంగా విజృంభిస్తోంది. రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి.  వరుసగా ఐదోరోజు కూడా రెండు లక్షలకు పైగా కరోనా కేసులు నమోదవడం ఆందోళన కల్గిస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా సెకండ్ వేవ్ పంజా(Corona Second Wave) విసురుతోంది. శరవేగంగా విస్తరిస్తూ కలకలం రేపుతోంది. రోజురోజుకూ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. గత వారం రోజుల్నించి పరిస్థితి మరీ దారుణంగా మారింది. రోజుకు రెండు లక్షలకు పైగా కేసులు నమోదవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. గత 24 గంటల్లో దేశంలో 2 లక్షల 73 వేల 810 కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో  1619 మంది కరోనా కారణంగా మరణించారు. 


ఇప్పటివరకూ దేశంలో 1 కోటి 50 లక్షల 61 వేల 919 పాజిటివ్ ( India Coronavirus update) కేసులు నిర్ధారణయ్యాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ వివిధ ఆసుపత్రుల్నించి  1 కోటి 29 లక్షల 53 వేల 821 మంది కోలుకున్నారు. కరోనా కారణంగా దేశంలో ఇప్పటివరకూ 1 లక్షా 78 వేల 769 మంది మరణించారు. దేశంలో ఇప్పుడు 19 లక్షల 29 వేల 329 కేసులున్నాయి. ఇక దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 12 కోట్ల 38 లక్షల 52 వేల 566 మందికి కరోనా వ్యాక్సినేషన్ (Covid Vaccination) అందించారు. అటు తెలుగు రాష్ట్రాల్లో సైతం కోవిడ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో తెలంగాణలో  4 వేల కొత్త కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఇప్పటివరకూ 3 లక్షల 55 వేల 433 కేసులు నమోదు కాగా...1833 మంది మరణించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 39 వేల 154 యాక్టివ్ కేసులున్నాయి. 


Also read: Karnataka Corona Update: కర్నాటకలో ప్రతి నిమిషానికి పది మందికి కరోనా వైరస్, దయనీయంగా మారుతున్న పరిస్థితి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook