Corona Third Wave: దేశంలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. కరోనా సెకండ్ వేవ్ కంటే..ఇప్పుడొచ్చిన థర్డ్‌వేవ్‌తో ముప్పు ఎక్కువని కేంద్ర ప్రభుత్వం హెచ్చరిస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో కరోనా కొత్త కేసుల సంఖ్య రోజుకు 2 లక్షలకు చేరువలో ఉంది. ప్రతిరోజూ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. వారం రోజుల వ్యవధిలోనే ఈ పెరుగుదల నమోదవడం విశేషం. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం వద్ద ఉన్న గణాంకాల్ని పరిశీలిస్తే కరోనా థర్డ్‌వేవ్‌తో ముప్పుు ఎక్కువని తెలుస్తోంది. సెకండ్ వేవ్ అడ్మిట్లతో పోలిస్తే ఆ సంఖ్య కూడా రెట్టింపయ్యే అవకాశముందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 
 
కరోనా సెకండ్ వేవ్‌కు కారణమైన డెల్టా వేరియంట్ కంటే వేగంగా సంక్రమించే ఒమిక్రాన్ కారణంగానే కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఒమిక్రాన్ వేరియంట్ సంక్రమణ రేటు తీవ్రంగా ఉన్నా ..తీవ్రత తక్కువేనని నిపుణులు ఇప్పటికే చెప్పారు. కానీ ఒమిక్రాన్ బలహీనమైనదనే భావన నుంచి ప్రజలు బయటకు రావాలని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే కరోనా థర్డ్‌వేవ్‌తో పొంచి ఉన్న ముప్పును కేంద్ర ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.


కరోనా థర్డ్‌వేవ్ (Corona Third Wave) కారణంగా ఆసుపత్రుల్లో చేరుతున్నవారి శాతం దేశవ్యాప్తంగా 5-10 వరకూ ఉందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అనూహ్యంగా ఉన్నందున..ఆసుపత్రులలో చేరేవారి సంఖ్య పెరగవచ్చని హెచ్చరించింది. కరోనా సెకండ్ వేవ్ కంటే ఇది పెద్దదని కేంద్రం తెలిపింది.సెకండ్ వేవ్ పరిస్థితుల్ని ఇప్పటి పరిస్థితులతో పోల్చుతూ కేంద్ర ప్రభుత్వం ఆసక్తికరమైన అంశాల్ని వెల్లడించింది. ఆ సమయంలో వంద డెల్టా వేరియంట్ (Delta Variant)కేసులు వెలుగు చూస్తే..ఇప్పుడు 4 వందల నుంచి 5 వందల ఒమిక్రాన్ వేరియంట్ (Omicron Variant)కేసులు నమోదయ్యే ముప్పు పొంచి ఉందని కేంద్రం స్పష్టం చేసింది. ఇక ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య సెకండ్ వేవ్ సమయంలో..వంద ఉంటే..ఇప్పుడు 125-250 వరకూ ఉండవచ్చని తెలిపింది. కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నందున దేశంలోని రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్ జారీ చేసింది. ఆక్సిజన్ బెడ్లు, ఐసీయూ బెడ్లు, వెంటిలేటర్లు సమకూర్చుకోవాలని తెలిపింది. వైద్య సిబ్బంది కొరత లేకుండా చూసుకోవాలని విజ్ఞప్తి చేసింది. 


Also read: Bihar,Karnataka CM's tests positive : ఇద్దరు సీఎంలకు కోవిడ్‌ పాజిటివ్‌.. హోం ఐసోలేషన్‌లో ముఖ్యమంత్రులు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook