Corona third wave: ఇండియాలో కరోనా థర్డ్ వేవ్ ఎప్పుడు వస్తుంది ?
Corona third wave likely to hit India next month: న్యూ ఢిల్లీ: కోవిడ్ థర్డ్ వేవ్ ఆగస్టులో దేశాన్ని తాకే అవకాశం ఉందని, సెప్టెంబర్‌లో ఇది గరిష్ట స్థాయికి చేరుకుంటుందని ఎస్‌బిఐ రీసెర్చ్ (SBI Research Report) సోమవారం ప్రచురించిన నివేదికలో పేర్కొంది. `కోవిడ్ -19: రేస్ టు ఫినిషింగ్ లైన్` అనే పేరుతో వెల్లడైన నివేదికలో భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ (Corona second wave) గురించి ప్రస్తావించింది.
Corona third wave likely to hit India next month: న్యూ ఢిల్లీ: కోవిడ్ థర్డ్ వేవ్ ఆగస్టులో దేశాన్ని తాకే అవకాశం ఉందని, సెప్టెంబర్‌లో ఇది గరిష్ట స్థాయికి చేరుకుంటుందని ఎస్‌బిఐ రీసెర్చ్ (SBI Research Report) సోమవారం ప్రచురించిన నివేదికలో పేర్కొంది. 'కోవిడ్ -19: రేస్ టు ఫినిషింగ్ లైన్' అనే పేరుతో వెల్లడైన నివేదికలో భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ (Corona second wave) గురించి ప్రస్తావించింది. ఏప్రిల్‌లో దేశాన్ని తాకిన సెకండ్ వేవ్ మే 7న గరిష్ట స్థాయికి చేరుకుందని ఎస్బీఐ రిసెర్చ్ నివేదిక పేర్కొంది. ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళతో పాటు పలు ఇతర రాష్ట్రాల్లో వేలాది కుటుంబాలను కరోనా సెకండ్ వేవ్ ప్రభావితం చేసింది.
"ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న డేటా ప్రకారం, జూలై 2వ వారంలో భారత్‌లో 10,000 కేసుల వరకు నమోదు కావచ్చని ఎస్బీఐ రిసెర్చ్ అంచనా వేసింది. ఏదేమైనా, ఆగస్టు రెండవ పక్షం నాటికి కేసులు పెరగడం ప్రారంభమవుతుంది ” అని ఎస్బిఐ రిసెర్చ్ నివేదిక స్పష్టంచేసింది.
Also read: Bone Death Issue: పోస్ట్ కోవిడ్‌లో మరో సమస్య, కొత్తగా బోన్ డెత్‌ను గుర్తించిన వైద్యు
గ్లోబల్ డేటా ప్రకారం, సగటున, కరోనా థర్డ్ వేవ్ పీక్ కేసులు సెకండ్ వేవ్ సమయంలో నమోదైన గరిష్ట సంఖ్యలో కేసుల కంటే 1.7 రెట్లు అధికంగా ఉండే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా సోమవారం నాడు కొత్తగా 39,796 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా నమోదైన కేసులు, మరణాలతో కలిపి కేసుల సంఖ్య 3,05,85,229 కు చేరుకోగా, మరణాల సంఖ్య 4,02,728 కు పెరిగింది, గత 88 రోజులలో ఇదే కనిష్టం కావడం గమనార్హం.
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన సమాచారం (COVID-19 in India) ప్రకారం.. యాక్టివ్ కేసులు 4,82,071 కు తగ్గాయి. అలాగే జాతీయ కోవిడ్ రికవరీ రేటు 97.11 శాతానికి మెరుగుపడింది.
Also read : Covaxin vs Delta variant: డెల్టా వేరియంట్‌పై కొవాక్సిన్ ప్రభావం 65.2%:Bharat Biotech
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook