Corona Updates in India: భారత్‌లో కోవిడ్ మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. గత కొంతకాలంగా నిత్యం 20 వేలకు పైగా కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. తాజాగా దేశవ్యాప్తంగా 20 వేల 279 కరోనా కేసులు బయటపడ్డాయి. 36 మంది మృత్యువాత పడ్డారు. నిన్నటితో పోలిస్తే కాస్త తగ్గినప్పటికీ దేశంలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కొత్తగా 2 వేలకుపైగా యాక్టివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తంగా దేశంలో లక్షా 52 వేల యాక్టివ్ కేసులు ఉన్నాయి. మొత్తం ఇప్పటివరకు కరోనా బారిన పడ్డ వారి సంఖ్య 5 కోట్లకు చేరువలో ఉంది. ఇటు మరణాల సంఖ్య రెట్టింపు అవుతోంది. ఇవాళ్టి వరకు కరోనా వల్ల 5 లక్షల 26 వేల మంది మృత్యువాత పడ్డారు. దేశంలో తొలిసారి 2020 జనవరిలో కొత్త కేసులు నమోదు అయ్యాయి. 


ఆ తర్వాత ప్రతి నెలా ఆ సంఖ్య రెట్టింపు అవుతూ వస్తోంది. మరోవైపు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. ప్రస్తుతం ప్రైవేట్ కేంద్రాల్లో బూస్టర్ డోస్ పంపిణీ చేస్తున్నారు. మొదటి, రెండో డోసు తీసుకున్న వారికి బూస్టర్ డోస్ ఇస్తున్నారు. కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. మార్గదర్శకాలను కఠిన తరంగా అమలు చేయాలని రాష్ట్రాలకు సూచించింది.



Also read:Bonalu Festival: నేడు లాల్ దర్వాజ, అంబర్‌పేట్ బోనాలు... నేటితో బోనాల పండగ ముగింపు.. ఆ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు..


Also read:Neeraj Chopra: ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో సత్తా చాటిన నీరజ్ చోప్రా... జావెలిన్ త్రో విభాగంలో సిల్వర్ మెడల్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.


sports