Bonalu Festival: నేడు లాల్ దర్వాజ, అంబర్‌పేట్ బోనాలు... నేటితో బోనాల పండగ ముగింపు.. ఆ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు..

Bonalu Festival 2022: నేటితో తెలంగాణలో బోనాల పండగ ముగియనుంది. చివరి రోజు లాల్ దర్వాజ, అంబర్ పేట్ బోనాలతో పాటు పలుచోట్ల అంగరంగ వైభవంగా వేడుకలు జరగనున్నాయి

Written by - Srinivas Mittapalli | Last Updated : Jul 24, 2022, 09:30 AM IST
  • నేడు లాల్ దర్వాజ, అంబర్‌పేట్ బోనాలు
  • నేటితో బోనాల పండగ ముగింపు
  • భారీ భద్రత ఏర్పాటు చేసిన పోలీసులు
Bonalu Festival: నేడు లాల్ దర్వాజ, అంబర్‌పేట్ బోనాలు... నేటితో బోనాల పండగ ముగింపు.. ఆ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు..

Bonalu Festival 2022: నేడు (జూలై 24) ఆషాఢ మాసం చివరి ఆదివారం. నేటితో బోనాల పండగ ముగియనుంది. చివరి రోజు హైదరాబాద్ పాతబస్తీలోని లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయంలో బోనాల పండగ ఘనంగా జరగనుంది. వందేళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో దశాబ్ధాలుగా బోనాల పండుగ ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నారు. పండగ నేపథ్యంలో అర్ధరాత్రి నుంచే అమ్మవారి ఆలయం వద్ద కోలాహలం నెలకొంది. ఆదివారం (జూలై 24) తెల్లవారుజాము నుంచే అమ్మవారికి మొక్కులు చెల్లించేందుకు భక్తులు తరలివస్తున్నారు.

ప్రతీ ఏటా గోల్కొండ జగదాంబిక అమ్మవారి ఆలయం నుంచి బోనాల పండగ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు జరుగుతున్నాయి. చివరగా పాతబస్తీ లాల్ దర్వాజ బోనాలు జరుగుతాయి. అదే రోజు హైదరాబాద్‌లోని అంబర్‌పేట్, మేడ్చల్, రంగారెడ్డి పరిధిలోని పలు ప్రాంతాల్లోనూ బోనాల పండగను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. స్థానికంగా ఉన్న అమ్మవారి ఆలయాల్లో భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. ఇవాళ లాల్ దర్వాజ, అంబర్‌పేట్ బోనాల నేపథ్యంలో ఆ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

పాతబస్తీలో ట్రాఫిక్ ఆంక్షలు ఇవే :

చార్మినార్ ప్రధాన రహదారి అస్రా హాస్పిటల్ నుంచి వచ్చే వాహనాలు మొఘల్‌‌పురా వాటర్ ట్యాంక్ మీదుగా బీబీ బజార్ వైపు మళ్లిస్తారు.

 ఉప్పుగూడ-ఛత్రినాక మార్గంలో వెళ్లే వాహనాలను గౌలిపురా క్రాస్ రోడ్స్ నుంచి మొఘల్​‌పురా పీఎస్ వైపు మళ్లిస్తారు.

కందికల్‌‌ గేట్ వైపు నుంచి వచ్చే వాహనాలను ఓల్డ్ ఛత్రినాక పీఎస్‌‌వై జంక్షన్‌‌ మీదుగా గౌలిపురా రూట్‌కి మళ్లిస్తారు

ఫలక్‌‌నుమా నుంచి వచ్చే వాహనాలను అలియాబాద్ మీదుగా షంషీర్‌‌‌‌గంజ్, గోశాల, తాడ్ బండ్ వైపు మళ్లిస్తారు.

రాజన్నబౌలి నుంచి వచ్చే వాహనాలను పత్తర్‌‌‌‌కి దర్గా లైన్‌, రామస్వామి గంజ్‌ ‌మీదుగా మళ్లిస్తారు.

అంబర్‌పేట్ ట్రాఫిక్ ఆంక్షలు :

ఉప్పల్-అంబర్‌పేట్ మార్గంలో రాకపోకలు పక్కనున్న కాలనీల మీదుగా మళ్లిస్తారు.

ఉప్పల్ వైపు నుంచి వచ్చే వాహనాలను మలికార్జున నగర్, డీడీ కాలనీ మీదుగా శివం సర్కిల్ వైపు మళ్లిస్తారు.

మూసారంబాగ్ వైపు నుంచి వచ్చే వాహనాలను అలీ కేఫ్ మీదుగా చే నంబర్ వైపు మళ్లిస్తారు.

ఉప్పల్ నుంచి సీబీఎస్ వైపు వెళ్లే బస్సులు తార్నాక, విద్యానగర్, నల్లకుంట, నింబోలి అడ్డా, చాదర్ ఘాట్ మీదుగా మళ్లిస్తారు.

కోఠి నుంచి ఉప్పల్ వాహనాలు అంబర్ పేట మీదుగా కాకుండా తార్నాక, హబ్సిగూడ మీదుగా ఉప్పల్ సర్కిల్‌కి చేరుకుంటాయి.

భారీ బందోబస్తు :

లాల్ దర్వాజ, అంబర్‌పేట్ బోనాల నేపథ్యంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు 2 వేల మంది పోలీసులతో బందోబస్తు చేపట్టారు. క్యూ లైన్ల వద్ద మహిళా పోలీసులు, షీ టీమ్స్ మఫ్టీలో విధులు నిర్వర్తిస్తారు. పోకిరీలు,ఆకతాయిలు ఎవరినైనా ఇబ్బందిపెడితే వెంటనే అదుపులోకి తీసుకుంటారు. 

Also Read: Gold Price Today: పసిడి ప్రియులకు బిగ్ షాక్.. వరుసగా రెండో రోజు భారీగా పెరిగిన బంగారం ధరలు...

Also Read: Telangana Rain Updates: తెలంగాణలో ఇవాళ భారీ వర్షాలు... ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News