India Corona: దేశంలో కరోనా ఆందోళన కల్గిస్తోందా..? యాక్టివ్ కేసులు ఎన్నంటే..!
India Corona: దేశంలో కరోనా పరిస్థితులు ఆందోళనకరంగా కనిపిస్తున్నాయి. ఓ పక్క రోజువారి కేసుల సంఖ్య తగ్గుతున్నా..యాక్టివ్ కేసులు మాత్రం పెరుగుతున్నాయి.
India Corona: దేశంలో కరోనా పరిస్థితులు ఆందోళనకరంగా కనిపిస్తున్నాయి. ఓ పక్క రోజువారి కేసుల సంఖ్య తగ్గుతున్నా..యాక్టివ్ కేసులు మాత్రం పెరుగుతున్నాయి. తాజాగా కరోనా బులిటెన్‌ను కేంద్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 4.55 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇందులో 2 వేల 745 మందిలో వైరస్ ఉన్నట్లు గుర్తించారు. దేశంలో ప్రస్తుతం పాజివిటీ రేటు 0.60 శాతానికి చేరింది.
తాజాగా 2 వేల 236 మంది కరోనా వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కోవిడ్ మహమ్మారి వల్ల ఆరుగురు చనిపోయారు. ఇటు క్రియాశీల కేసులు ఆందోళన కల్గిస్తున్నాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 18 వేలు దాటాయి. ప్రస్తుతం దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య 18 వేల 386గా ఉంది. ఇప్పటివరకు 4.31 కోట్ల కరోనా కేసులు నమోదు అయ్యాయి. మరోవైపు 4.26 కోట్ల మంది కరోనా నుంచి జయించారు.
కరోనా వల్ల ఇప్పటివరకు 5.24 లక్షల మంది మృతి చెందారు. మరోవైపు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 10.9 లక్షల మందికి టీకా అందించారు. మొత్తంగా 193.54 కోట్ల మందికి టీకా పంపిణీ చేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రైవేట్ కేంద్రాల్లో బూస్టర్ డోస్ పంపిణీ చేస్తున్నారు. కరోనా పట్ల దేశప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కేంద్ర వైద్యారోగ్యశాఖ హెచ్చరిస్తోంది.
Also read:Amla juice benefits: ఉసిరికాయ రసంతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
Also read:CM Jagan Tour: రేపు ఢిల్లీకి ఏపీ సీఎం జగన్..టూర్ వెనుక కారణం అదేనా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook