Corona Updates in India: దేశంలో కరోనా కట్టడిలోనే ఉంది. గత కొంతకాలంగా హెచ్చు తగ్గుల మధ్య కేసులు నమోదు అవుతున్నాయి. ఇటీవల 10 వేలకు అటు ఇటుగా కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. తాజాగా 3.39 లక్షల మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా..5 వేలకు పైగా కేసులు రికార్డు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో 5 వేల 443 కేసులు నమోదు అయ్యాయి. రోజువారి పాజిటివిటీ రేటు 1.61 శాతంగా ఉందని వైద్యాధికారులు తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రికవరీ రేటు అధికంగానే ఉంది. పాజిటివ్ కేసులకు సమానంగానే రికవరీలు ఉన్నాయి. కొత్తగా 5 వేల 291 కరోనా నుంచి కోలుకుని వారియర్‌గా నిలిచారు. రికవరీ రేటు 98.71 శాతంగా ఉంది. దేశంలో గడిచిన 24 గంటల్లో 46 వేల 342 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రోజువారి కరోనా కేసుల్లో 0.10 శాతం ఉంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 4.45 కోట్ల కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇటు మొత్తం మరణాలు 5 లక్షల 28 వేల 429గా ఉన్నాయి. 


మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ముమ్మరం సాగుతోంది. ఇప్పటికే మొదటి, రెండో డోసుల పంపిణీ పూర్తైంది. ప్రస్తుతం బూస్టర్ డోసును అందిస్తున్నారు. ప్రైవేట్ కేంద్రాల్లో టీకాను పంపిణీ చేస్తున్నారు. నిన్న 15.85 లక్షల మందికి డోసును అందించారు. ఇప్పటివరకు 217 కోట్ల కరోనా టీకాలను పంపిణీ చేశారు. ఈమేరకు కేంద్ర వైద్యారోగ్య శాఖ కరోనా బులిటెన్‌ను విడుదల చేసింది. 



Also read:IND vs AUS: రేపే భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండో టీ20 మ్యాచ్‌..అతడి రాకపైనే టీమిండియా ఆశలు..!


Also read:NIA Raids: పీఎఫ్‌ఐయే టార్గెట్‌గా ఎన్‌ఐఏ దాడులు..ఉగ్ర మూలాలపై ప్రత్యేక నిఘా..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.