IND vs AUS: రేపే భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండో టీ20 మ్యాచ్‌..అతడి రాకపైనే టీమిండియా ఆశలు..!

IND vs AUS: టీ20 వరల్డ్ కప్ సన్నాహకంలో భాగంగా ఆస్ట్రేలియాతో మూడు టీ20ల సిరీస్‌ కొనసాగుతోంది. మొదటి మ్యాచ్‌లో కంగారు జట్టు రఫాడించింది. రేపు రెండో టీ20 మ్యాచ్‌ జరగనుంది.

Written by - Alla Swamy | Last Updated : Sep 22, 2022, 10:15 AM IST
  • మూడు టీ20ల సిరీస్‌
  • 1-0 ఆధిక్యంలో ఆస్ట్రేలియా
  • రేపే రెండో మ్యాచ్
IND vs AUS: రేపే భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండో టీ20 మ్యాచ్‌..అతడి రాకపైనే టీమిండియా ఆశలు..!

IND vs AUS: టీమిండియా గడ్డపై కంగారు జట్టు జోరు కొనసాగుతోంది. తొలి మ్యాచ్‌లో భారత్‌పై ఘనవిజయం సాధించింది.మూడు టీ20ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. రేపు(శుక్రవారం) ఇరు జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. నాగ్‌పూర్ వేదికగా రేపు రాత్రి 7 గంటలకు మ్యాచ్‌ ప్రారంభంకానుంది. ఈమ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ సమం చేయాలని భారత్ యోచిస్తోంది. తొలి మ్యాచ్‌లో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకుని పోటీలో నిలవాలని భావిస్తోంది.

మొదటి టీ20 మ్యాచ్‌లో భారీ స్కోర్ చేసినా..బౌలింగ్‌ వైఫల్యంతో ఓటమిని రుచి చూసింది. దీనిని సరి చేసుకోవాలని టీమిండియా ప్రణాళికలు రచిస్తోంది. ఆసియా కప్ నుంచి డెత్ ఓవర్ల ఫోబియా జట్టును వెంటాడుతోంది. చివరి ఓవర్లలో దారుణంగా పరుగులు ఇవ్వడం ద్వారా ఓటమిని మూటగట్టుకుంటోంది. ఆ సమస్యను అధికమించేందుకు భారత ఆటగాళ్లు పక్కాగా సాధన చేస్తున్నారు. ఎన్నో అంచనాలు ఉన్న భువనేశ్వర్‌ కుమార్ డెత్ ఓవర్లలో తేలిపోతున్నాడు.

18,19, 20 ఓవర్లలో ధారళంగా పరుగులు ఇస్తున్నారు. ఆసియా కప్‌లో పాకిస్థాన్, శ్రీలంక మ్యాచ్‌ల్లోనూ ఇలాగే జరిగింది. ఇటు ఆసీస్‌ మ్యాచ్‌లోనూ అదే రిపీట్ అయ్యింది. ఇటు యువ పేసర్ హర్షల్ పటేల్ సైతం విఫలమయ్యాడు. ఇద్దరు కలిసి 101 పరుగులు ఇచ్చారు. జట్టులోకి బుమ్రా వస్తే సమస్య పరిష్కారం అవుతుందన్న వాదన ఉంది. గాయం కారణంగా అతడు జట్టుకు దూరమయ్యాడు. రెండో టీ20 మ్యాచ్‌కు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

అతడి రాకతో బౌలింగ్ దళానికి బలం చేకూరుతుందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఫీల్డింగ్ సమస్య సైతం భారత్‌ను వెంటాడుతోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా తొలి 20 మ్యాచ్‌లో క్యాచ్‌లను జార విడిచారు. ఔట్ అయిన ఎల్బీలకు సైతం అప్పీల్ చేయలేని పరిస్థితి నెలకొంది. ఇటు టీమిండియా గడ్డపై ఆస్ట్రేలియా దుమ్మురేపుతోంది. మూడు టీ20ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది. తొలి మ్యాచ్‌లో బౌలింగ్ పరంగా దారుణంగా పరుగులు ఇచ్చినా..బ్యాటింగ్‌లో మాత్రం అదరగొట్టింది. 

ఆది నుంచి టీమిండియా బౌలర్లపై కౌంటర్ ఎటాక్ చేశారు. పించ్, గ్రీన్‌..భారత బౌలర్లపై ఎదురుదాడి చేశారు. దీంతో పది ఓవర్లలోనే వందకు పైగా స్కోర్ చేశారు. ఆ తర్వాత భారత బౌలర్లు పుంజుకున్నా..డెత్ ఓవర్లలో ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఆకట్టుకున్నారు. దీంతో కొండంత స్కోర్ కరిగిపోయింది. మొత్తంగా రెండో టీ20 మ్యాచ్‌ రసవత్తరంగా సాగనుంది. నాగ్‌పూర్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించే అవకాశం ఉంది. దీంతో భారీ స్కోర్లు నమోదు సూచనలు ఉన్నాయి.

Also read:Maharashtra: సొంత చెల్లిపైనే 8 ఏళ్లపాటు కాటేసిన కీచక అన్న.. మౌనాన్ని వీడి 31 ఏళ్ల తర్వాత ఫిర్యాదు..  

Also read:Gold Price Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్... భారీగా తగ్గిన బంగారం ధర..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News