India Corona: దేశంలో మరో వేవ్ రాబోతోందా..ఇవాళ కేసుల సంఖ్య ఎంతంటే..!
India Corona: దేశంలో కరోనా కేసులు ఆందోళన కల్గిస్తున్నాయి. తాజాగా రోజువారి కేసులు మూడు వేల మార్క్‌ను దాటాయి. యాక్టివ్ కేసులు సైతం అమాంతంగా పెరుగుతున్నాయి.
India Corona: దేశంలో కరోనా కేసులు ఆందోళన కల్గిస్తున్నాయి. తాజాగా రోజువారి కేసులు మూడు వేల మార్క్‌ను దాటాయి. యాక్టివ్ కేసులు సైతం అమాంతంగా పెరుగుతున్నాయి. పాజిటివిటీ రేటు పెరుగుతుండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. గడిచిన 24 గంటల్లో 4.41 లక్షల మందికి కరోనా పరీక్షలు చేశారు. వీరిలో 3 వేల 712 మందిలో వైరస్ ఉన్నట్లు గుర్తించారు.
మహారాష్ట్ర, కేరళ నుంచే అధిక కేసులు నమోదు అయ్యాయి. రోజువారి పాజిటివిటీ రేటు 0.60 శాతంగా ఉంది. తాజాగా 2 వేల 584 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కోవిడ్ వల్ల ఐదుగురు మృతి చెందారు.ఇటు యాక్టివ్ కేసులు రెట్టింపు అవుతున్నాయి. తాజాగా ఆ సంఖ్య 19 వేల 509కి చేరింది. ఇప్పటివరకు 4.31 కోట్ల మందికి వైరస్ సోకింది. మొత్తంగా 4.26 కోట్ల మంది కరోనా వారియర్‌గా నిలిచారు.
దేశంలో రికవరీ రేటు పెరుగుతోంది. ఇప్పటివరకు రికవరీ రేటు 98.74 శాతంగా ఉంది. మహారాష్ట్రలోని ముంబైలో కరోనా కలవరం పుట్టిస్తోంది. అక్కడ పాజిటివిటీ రేటు 8.4 శాతంగా ఉందని అధికారులు తెలిపారు. ముంబైలో తాజాగా 739 కరోనా కేసులు వెలుగుచూశాయి. ఫిబ్రవరి తర్వాత అత్యధిక కేసులు నమోదు కావడం ఇదేనని గణాంకాలు చెబుతున్నాయి. ఈమేరకు కేంద్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.
మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. గడిచిన 24 గంటల్లో 12.4 లక్షల మంది టీకా తీసుకున్నారు.మొత్తంగా 193.7 కోట్ల మంది ఇప్పటివరకు వ్యాక్సిన్ తీసుకున్నారు. ప్రస్తుతం దేశంలో ప్రైవేట్ కేంద్రాల్లో బూస్టర్ డోస్ అందిస్తున్నారు.
Also read:Telangana Formation Day: ఢిల్లీలో తెలంగాణ సంబురం..పాల్గొననున్న అమిత్ షా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook