Covishield and Covaxins: కరోనా వైరస్ మహమ్మారిని అంతం చేయడానికి భారత్‌లో వ్యాక్సిన్లు ఆమోదం పొందడంతో కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌లను పలు రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నారు. కరోనాను తరమికొట్టేందుకు అత్యవసర వినియోగం నిమిత్తం వ్యాక్సిన్లకు ఆమోదం లభించడంతో టీకాలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


జనవరి 16 నుంచి దేశవ్యాప్తంగా కరోనా వైరస్(CoronaVirus) వ్యాక్సిన్ల పంపిణీ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మొత్తం 1.65 కోట్ల కొవిషీల్డ్, కొవాగ్జిన్‌ డోసుల టీకాలను రాష్ట్రాలకు పంపినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. తొలుత అన్ని ప్రాంతాల్లోనూ ఆరోగ్య కార్యకర్తలు, వైద్య సిబ్బందికి కరోనా టీకాలు ఇవ్వనున్నట్లు అధికారులు చెబుతున్నారు.


 


Also Read: Reliance Jio: డేటా కోసం రిలయన్స్ జియో సరికొత్త ప్లాన్.. పూర్తి వివరాలు 


ముందుగా 5 వేల కేంద్రాల్లో దేశవ్యాప్తంగా కోవిషీల్డ్, కోవాగ్జిన్(Covaxin) వ్యాక్సిన్ ప్రక్రియ మొదలు పెట్టాలని భావించగా.. అనంతరం కేంద్రాల సంఖ్యను 2,934కు తగ్గించినట్లు పేర్కొన్నారు. ఈనెల 16నుంచి ప్రారంభించనున్న తొలిదశ వ్యాక్సినేషన్‌లో మొత్తం 1.65 కోట్ల టీకాలను ఇవ్వనున్నట్లు తెలిపారు. ఎలాంటి వివక్షకు తావులేకుండా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు టీకాను సరఫరా చేశామని వైద్యశాఖ అధికారులు వివరించారు.



Also Read: Pongal 2021 Date, Time: మకర సంక్రాంతి తేదీలు, ముహూర్తం.. పండుగ ప్రాముఖ్యత



అయితే ఒక్కరోజులో ఎన్ని టీకాలు ఇవ్వాలో తాము నిర్దేశించిన సంఖ్యకు మించి వ్యాక్సిన్‌‌ను ఇవ్వకూడదని రాష్ట్రాలకు మార్దనిర్దేశం చేసింది. టీకాలు ఇవ్వడాన్ని దశలవారీగా పెంచేందుకు సిద్ధంగా ఉన్నామని ఆరోగ్య మంత్రిత్వశాఖ పేర్కొంది. ఆయా కేంద్రాల్లో రోజుకు 100 మాత్రమే టీకాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం.


Also Read: Gold Price Today: మార్కెట్‌లో నేటి బంగారం, వెండి ధరలు 


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook