Adopt These to Save Your Life from Coronas Omicron Variant:  కరోనా శకం (Corona) ముగుస్తుంది అనుకున్న సమయంలో మరో కొత్త వేరియంట్ ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించి తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. మళ్లీ ప్రపంచ దేశాలు ఆంక్షల కొనసాగించే దిశగా వెళ్తున్నాయి.. ఆఫ్రికా దేశాలలో (Africa) ప్రారంభమై.. ప్రపంచ వ్యాప్తంగా విస్తరించి.. ముప్పుతిప్పలు పెడుతుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కొత్త కరోనా వేరియంట్ ఒమిక్రాన్ (New Corona Variant Omicron) వ్యాక్సిన్ (Corna Vaccine) తీసుకున్నవారికి కూడా సోకి వారిలో ప్రభావాన్ని చూపటం ఆరోగ్య నిపుణులను కలవరపెడుతుంది. నిపుణుల అభిప్రాయాల ప్రకారం.. బలహీనమైన రోగనిరోధక శక్తి (Weak Immune System) కలిగి ఉన్నవారికి కరోనా వేరియంట్ ఒమిక్రాన్ (Omicron) ప్రాణాంతకం కావచ్చని తెలిపారు. ప్రస్తుతం ఇది మన దేశంలో కూడా విస్తరించి ప్రమాద ఘంటికలు మోగిస్తుంది. 


ఇలాంటి సమయంలో వ్యాక్సిన్ వేసియించుకున్నా ..  వేయించుకోకున్నా.. మన ముందు ఉన్న మెదటి సవాల్... రోగనిరోధక శక్తి పెంచుకోవటం.. ఈ సమయాల్లో మనం కొంచెం  తెలివిగా ఆలోచించి రోగ నిరోధక శక్తి పెంచుకోవటమే కాకుండా.. కరోనా వ్యాప్తి చెందే విధానానికి అనగా... సామజిక దూరం పాటిస్తూ (Social Distance).. శానిటైజర్ (Sanitizer), మాస్క్ (Mask) లను వాడటం తప్పనిసరి. 


Also Read: Sirivennela Seetharama Sastry : సిరివెన్నెల చనిపోవడానికి కారణాలివే


కాబట్టి మన జీవనశైలి మరియు తీసుకునే ఆహారంలో కొన్ని ముఖ్యమైన మార్పులు చేసుకోవడం చాలా మంచిది. ఇది రోగనిరోధక శక్తిని బలపరచటమే (Strong Immune System) కాకూండా.. ఇన్ఫెక్షన్ (Corona Infection) నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోగలుగుతారు. మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త గురించి ఇక్కడ తెలుపబడింది. 


రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలు.. 
పండ్లు, కూరగాయలు, బీన్స్, చిక్కుళ్ళు, విత్తనాలు వంటి ఆహార పదార్థాలను చేర్చండి. అవి మీ రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తాయి మరియు వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు (Antioxidants) కరోనా వలన కలిగే ఇన్ఫ్లమేషన్ (Corona Inflammation) ను దీటుగా ఎదుర్కొంటాయి. 


బాడీని డీ హైడ్రేషన్ కానివ్వకండి 
ఈ సమయంలో మన శరీరంలో నీటి శాతం అస్సలు తగ్గకూడదు.. బాడీలో నీటి శాతం తగ్గితే అది నేరుగా రోగనిరోధక వ్యవస్థను (Immune Sysytem) ప్రభావితం చేస్తుంది. చలికాలంలో (Winter) చాలా మంది నీరు తాగకుండా ఉంటారు కారణంగా శరీరం డీ హైడ్రేషన్ (Body Dehydration) కు గురవుతుంది. ఫలితంగా శరీర రోగ నిరోధక వ్యవస్థ తగ్గిపోతుంది. కరోనా వేరియంట్స్ (Corona New Variants) శరీరంలో ప్రవేశించగానే రోగనిరోధక వ్యవస్థపై ప్రభావం చూపుతుంది కావున సరిపోయేన్ని నీటిని తాగటం చాలా మంచిది. 


Also Read: Shardul Thakur's engagement pics: శార్థుల్ ఠాకూర్ ఎంగేజ్‌మెంట్ ఫోటోలు


ఒత్తిడికి దూరంగా ఉండండి 
ఒత్తిడి లేదా స్ట్రెస్ (Stress) అనేది మన శరీర రోగనిరోధక శక్తిపై నేరుగా ప్రభావాన్ని చూపుతుంది. ఒత్తిడి మరియు ఆందోళన శరీరం యొక్క రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. ఒత్తిడిని తగ్గించే పనులను చేయటం మంచిది. 


మంచి నిద్ర.. 
సరిగా నిద్ర లేపోవటం కూడా మన శరీర రోగనిరోధక శక్తిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. అంతేకాదు.. నిద్ర సరిగా లేకపోవటం వలన ఇతర వ్యాధులు కలిగే అవకాశం ఉంది. కావున సరైన సమయం పాటు నిద్ర అవసరం (Enough Sleep)..


మల్టీవిటమిన్లు సేకరణ... 
కొన్ని సార్లు మల్టీవిటమిన్లు హాని కలిగిస్తాయి. కొంతమంది శరీర రోగనిరోధక వ్యవస్థను పటిష్టం చేసుకోటానికి రెగ్యులర్ గా మల్టీవిటమిన్లు (Multivitamins) తీసుకుంటూ ఉంటారు. వీటికి బదులుగా సహజ పద్దతిలో విటమిన్, మినరల్ లను తీసుకునే విధంగా ఫుడ్ ప్లాన్ (Food Plan) తయారు చేసుకోండి. 


Also Read: డిసెంబర్ 1 నుంచి మారనున్న కొత్త నిబంధనలు ఇవే, ఇవాళ తప్పనిసరిగా చేయాల్సిన పనులివే


రెగ్యులర్ హెల్త్ చెకప్ 
శరీరంలో విటమిన్ D (Vitamin D), క్యాల్షియం (Calcium), ఐరన్ లెవల్స్ (Iron Levels) ను రెగ్యులర్ గా చెకప్ చేయించుకోవటం అవసరం. రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉండటానికి శరీరానికి అవసరరమైన పోషకాలను తీసుకోవటం తప్పనిసరి. ఏవైనా పోషకాల లెవెల్ శరీరంలో తక్కువగా ఉంటె వాటిని అందించే ఆహార పదార్థాలను మీ డైట్ ప్లాన్ లో కలుపుకోండి. 


(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ ఊహ జనితాలు మాత్రమే.. దయచేసి వీటిని పాటించే ముందు వైద్యుని సలహా తీసుకోండి. ZEE NEWS TELUGU దీన్ని ధృవీకరించలేదు)


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook