Coronavirus: మృతదేహాల నుంచి కరోనావైరస్ వ్యాపిస్తుందా ?
కరోనావైరస్ ( Coronavirus) సోకిన వారు చనిపోతే.. వారి మృతదేహం నుంచి కూడా వైరస్ ఇతరులకు వ్యాపిస్తుందా అనే ప్రశ్న ఇప్పుడు చాలా మందిని వేధిస్తోంది. కర్ణాటకలో చనిపోయిన వృద్ధుడి అంత్యక్రియలకు ప్రత్యేక ఏర్పాట్లు చేయడం చూస్తోంటే... మృతదేహంతో కూడా కరోనావైరస్ సోకుతుందా అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
న్యూ ఢిల్లీ: కరోనావైరస్ ( Coronavirus) సోకిన వారు చనిపోతే.. వారి మృతదేహం నుంచి కూడా వైరస్ ఇతరులకు వ్యాపిస్తుందా అనే ప్రశ్న ఇప్పుడు చాలా మందిని వేధిస్తోంది. కర్ణాటకలో రెండు రోజుల క్రితమే ఓ వృద్ధుడు కరోనావైరస్‌తో చనిపోగా... ఆ వృద్దుడి అంత్యక్రియల కోసం అక్కడి అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా కరోనావైరస్ సోకిన వారికి ( Coronavirus positive cases) చికిత్స అందించే విధానం కూడా కొంచెం భిన్నంగానే ఉంది. కరోనావైరస్ సోకిన వారి నుంచి మరొకరికి ఆ వైరస్ సోకకుండా ఉండటం కోసం ముందు జాగ్రత్త చర్యగా వారిని ఐసోలేషన్ వార్డుల్లో ఉంచి ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్నారు. అలా చేయడం తప్పనిసరి కూడా. కానీ ఇక్కడే కొంతమందికి లేనిపోని అనుమానాలు మొదలువుతున్నాయి. బతికున్న వారిని వేరుగా ఉంచి చికిత్స అందించడం, కర్ణాటకలో చనిపోయిన వృద్ధుడి (Coronavirus first death in India) అంత్యక్రియలకు ప్రత్యేక ఏర్పాట్లు చేయడం చూస్తోంటే... మృతదేహంతో కూడా కరోనావైరస్ సోకుతుందా అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
సోషల్ మీడియాలో పలువురు ఇదే విషయమై సందేహాలు సైతం వెలిబుచ్చడంతో తాజాగా ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రి డైరెక్టర్ రణ్‌దీప్ గులెరియా స్పందించారు. మృతదేహాల నుంచి కరోనా వైరస్ వ్యాపించదని గులెరియా స్పష్టంచేశారు. వైరస్ శ్వాసకోశ స్రావం (respiratory secretion) ద్వారా మాత్రమే వ్యాపిస్తుందని.. వైరస్ సోకినవారు దగ్గినప్పుడే అది సాధ్యమవుతుందని గులేరియా తేల్చిచెప్పారు. అందుకే కరోనావైరస్ సోకిన వారి మృతదేహాల అంత్యక్రియల్లో పాల్గొంటే వచ్చే నష్టమేమీ లేదని గులెరియా తెలిపారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..