Coronavirus: కరోనా ముప్పుపై రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు
Omicron BF.7 Variant: కరోనా ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ముందే అప్రమత్తమైంది. అన్ని రాష్ట్రాలకు తగిన సూచనలు ఇస్తూ.. ఎప్పటికప్పుడు జాగ్రత్తలు, సూచనలు ఇస్తోంది. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఎఫ్.7 ఇన్ఫెక్షన్ కేసులు పెరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది.
Omicron BF.7 Variant: కరోనా మహామ్మారి మళ్లీ పంజా విసిరేందుకు రెడీ అవుతోంది. ఏమాత్రం అలసత్వం వహించినా.. ప్రపంచానికి ముప్పుగా వాటిల్లే ప్రమాదం ఉంది. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఎఫ్.7 ఇన్ఫెక్షన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. వరుసగా సమీక్షలు నిర్వహిస్తూ.. ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరికలు జారీ చేస్తోంది. దేశంలో ఎక్కడి నుంచైనా శ్వాసకోశ వ్యాధులు వచ్చే అవకాశం ఉన్న సంకేతాలను ముందుగానే గుర్తించడం కోసం ఆసుపత్రి ఆధారిత వ్యవస్థను పటిష్టపరచాలని అన్ని రాష్ట్రాలను కోరింది.
దేశంలోని కొన్ని ప్రాంతాలలో కోవిడ్ -19 లేదా శ్వాసకోశ వ్యాధులకు సంబంధించిన ఆసుపత్రిలో అకస్మాత్తుగా విజృంభిస్తే అది మనకు ఓ హెచ్చరిక అని ఓ సీనియర్ అధికారి తెలిపారు. అన్ని ఆసుపత్రులు నిశితంగా గమనించాలని సూచించారు. ఏదైనా అసాధారణమైన నమూనాలను కూడా గుర్తించాలని చెప్పారు.
కరోనా నియంత్రణ చర్యలు, టీకా పురోగతికి సంబంధించి వివిధ రాష్ట్రాల ఆరోగ్యశాఖ మంత్రులతో కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆరోగ్య సౌకర్యాల ఆధారిత వ్యవస్థతో పాటు, శ్వాసకోశ వైరస్ సంబంధిత పర్యవేక్షణపై శ్రద్ధ వహించాలన్నారు. మనుషుల మలం ద్వారా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున వివిధ రాష్ట్రాల్లో మురుగు, మురుగునీటిని పర్యవేక్షించడం అవసరమని అన్నారు.
జీనోమ్ సీక్వెన్సింగ్‌పై ప్రత్యేక దృష్టి
కొత్త వేరియంట్‌లను సకాలంలో గుర్తించేలా INSACOG నెట్‌వర్క్ ద్వారా వేరియంట్‌లను ట్రాక్ చేయడానికి పాజిటివ్ కేసు నమూనాల మొత్తం జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం నిఘా వ్యవస్థను బలోపేతం చేయాలని ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా రాష్ట్రాలను కోరారు. INSACOG క్రమం తప్పకుండా కోవిడ్ పాజిటివ్ శాంపిల్స్ జీనోమ్ సీక్వెన్సింగ్ చేస్తోంది.
Also Read: Winter Storm in US: అమెరికాలో మంచు తుఫాను బీభత్సం.. 34కి చేరిన మృతుల సంఖ్య
Also Read: Guntur: ఆమె కళ్లలో ఆనందం కోసం పక్కా స్కెచ్.. అతితెలివి ఉపయోగించి చివరికి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook