India: 25లక్షలకు చేరువలో కరోనా కేసులు
భారత్‌లో కరోనావైరస్ ( Coronavirus ) ఉధృతి నానాటికీ పెరుగుతూనే ఉంది. గత కొన్నిరోజుల నుంచి 60వేలకు పైగానే కరోనా కేసులు నమోదవుతున్నాయి. అంతేకాకుండా మరణాల సంఖ్య కూడా మరోసారి వేయి దాటడం అందరినీ కలవరపెడుతోంది.
Covid-19 Cases: న్యూఢిల్లీ: భారత్‌లో కరోనావైరస్ ( Coronavirus ) ఉధృతి నానాటికీ పెరుగుతూనే ఉంది. గత కొన్నిరోజుల నుంచి 60వేలకు పైగానే కరోనా కేసులు నమోదవుతున్నాయి. అంతేకాకుండా మరణాల సంఖ్య కూడా మరోసారి వేయి దాటడం అందరినీ కలవరపెడుతోంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 64,553 కరోనా కేసులు నమోదు కాగా.. రికార్డు స్థాయిలో మరోసారి 1007 మంది ఈ మహమ్మారి కారణంగా మరణించారు. తాజాగా నమోదైన కేసులతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 24,61,191కి పెరిగింది. దీంతోపాటు కరోనా మరణాల సంఖ్య 48,040కి చేరిందని కేంద్ర వైద్యఆరోగ్య మంత్రిత్వశాఖ ( Health Ministry ) శుక్రవారం తెలిపింది. Also read: Narendra Modi: కాంగ్రెసేతర ప్రధానిగా మోదీ రికార్డు
ప్రస్తుతం దేశంలో 6,61,595 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటివరకు 17,51,556 మంది బాధితులు ఈ మహమ్మారి నుంచి కోలుకున్నారు. అదేవిధంగా ఆగస్టు 13న 8,48,728 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ఐసీఎంఆర్ ( ICMR ) పేర్కొంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 2,76,94,416 మందికి కరోనా పరీక్షలు చేసినట్లు వెల్లడించింది. Also read: Nepotism: Sadak 2 ట్రైలర్‌కు 8మిలియన్ల డిస్‌లైక్‌లు