'కరోనా వైరస్'.. ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోన్న మృత్యు కెరటం. మనిషి నుంచి మనిషికి సోకే ఈ వ్యాధి ఇప్పటికే వేల మంది ప్రాణాలను బలి తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా 170 దేశాలు కరోనా వైరస్ బారిన పడ్డాయంటే దీని ప్రభావం అంతా ఇంతా కాదని చెప్పవచ్చు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా వైరస్ దెబ్బకు ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా మృతి చెందిన వారి సంఖ్య  11 వేల  310కి చేరుకుంది. చైనా తర్వాత ఇటలీలో అత్యధిక మృతుల  సంఖ్య ఉంది.  దీంతో కరోనా వైరస్ ప్రభావాన్ని నివారించుకునేందుకు చాలా దేశాలు శుభ్రత, పరిశుభ్రతను అవలంభిస్తున్నాయి. ఈ క్రమంలో 'కరోనా వైరస్' పై ప్రపంచవ్యాప్తంగా కొత్త కోణం మొదలైంది. చాలా మంది ప్రజలు కరోనా వైరస్ పరోక్షంగా మనకు మంచే చేస్తోందనే విశ్వాసంతో ఉన్నారు. అంటే ఓ రకంగా కరోనా వైరస్ ముప్పు చేస్తున్నప్పటికీ .. ప్రజలు సానుకూల ఆలోచనా విధనానాన్ని అవలంభిస్తున్నారని దీన్నిబట్టి చూస్తే తెలుస్తుంది. దీంతో అందరూ ఎవరికి వారు  వైరస్ ముప్పు నుంచి తప్పించుకోవడానికి పరిశుభ్రతను అలవాటు చేసుకుంటున్నారు.  ప్రపంచవ్యాప్తంగా ఈ మార్పుకు కారణం ''కరోనా వైరస్'' మాత్రమేనంటున్నారు జనం. 


మరోవైపు ఇదే విధంగా రెండు రోజుల  క్రితం మెగా ఫ్యామిలీ నటుడు నాగబాబు కూడా ట్వీట్ చేశారు. కనిపించని దేవున్ని నమ్ముకోవడం కంటే.. కనిపించే సైంటస్టులను ప్రజలు నమ్ముకుంటున్న పరిస్థితి ఉందని ట్వీట్ లో తెలిపారు. కరోనా వైరస్ కు మంచి మందు కనిపెట్టి తమ ప్రాణాలను కాపాడాలని కోరుతున్నారని ట్వీట్ చేశారు.



జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..