Coronavirus updates: దేశంలో మళ్లీ పెరిగిన కోవిడ్ కేసులు, 12,885 మందికి పాజిటివ్
Coronavirus updates: గత కొద్దికాలంగా కేసుల్లో ఈ హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. తాజాగా 461 మరణాలు నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్య శాఖ ఈ గణాంకాలను ప్రకటించింది.
Coronavirus updates: 12,885 New Covid Cases In India and 461 deaths : దేశంలో తాజాగా కరోనా కేసులు (Corona cases) మళ్లీ కాస్త పెరిగాయి. తాజాగా 10,67,914 మందికి నిర్ధారణ పరీక్షలు చేస్తే..12,885 మందికి పాజిటివ్‌గా తేలింది. గత కొద్దికాలంగా కేసుల్లో ఈ హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. తాజాగా 461 మరణాలు నమోదయ్యాయి. గురువారం కేంద్ర ఆరోగ్య శాఖ ఈ గణాంకాలను ప్రకటించింది.
గతేడాది నుంచి ఇప్పటి వరకు 3.43 కోట్ల మంది కరోనా బారిన పడ్డారు. వారిలో 3.37 కోట్ల మంది కోలుకున్నారు. నిన్న ఒక్కరోజే 15,054 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఇక యాక్టివ్ కేసుల విషయానికి వస్తే.. కేసుల సంఖ్య బాగా తగ్గిపోయింది. ప్రస్తుతం 1,48,579 మంది చికిత్స పొందుతున్నారు.
Also Read : T20 World Cup 2021: భారత్ సెమీస్ చేరాలంటే.. ఈ అద్భుతాలు జరగాల్సిందే!
దీంతో యాక్టివ్ కేసుల (Active cases) రేటు 0.43 శాతానికి తగ్గింది. అలాగే రికవరీ రేటేమో (Recovery rate) 98.23 శాతానికి చేరింది. కానీ కేరళలో (Kerala) మాత్రం కొవిడ్ గణాంకాలను సవరిస్తుండటంతో మృతుల సంఖ్య భారీగా కనిపిస్తోంది. కేరళలో మృతుల సంఖ్య 362గా రికార్డయింది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 4,59,652 మంది కరోనా (Corona) వల్ల చనిపోయారు. ఇక నిన్న 30.9లక్షల మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. మొత్తంగా 107.63 కోట్ల వ్యాక్సిన్ (Vaccine) డోసులను కేంద్రం పంపిణీ చేసింది.
Also Read : Fuel Price Cut: భారీగా దిగొచ్చిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ప్రస్తుత రేట్లు ఇవే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook