Corona second wave: కరోనా మహమ్మారి దేశవ్యాప్తంగా పంజా విసురుతోంది. సరిగ్గా ఏడాది వ్యవధి అనంతరం తిరిగి విస్తరిస్తుండటం ఆందోళన కల్గిస్తోంది. అదే సమయంలో  కరోనా సెకండ్ వేవ్ ముఖ్యంగా ఎవర్ని టార్గెట్ చేస్తుందనేది మరీ ఆందోళనకరంగా మారింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2020 మార్చ్ నెలలో దేశంలో విస్తరించడం ప్రారంభమై..ప్రాణాంతకమై దేశాన్ని గజగజలాడించిన విషయం తెలిసిందే. సరిగ్గా ఏడాది వ్యవధి తరువాత ఇప్పుడు మళ్లీ కరోనా వైరస్ (Coronavirus)పంజా విసురుతోంది. జనాన్ని భయభ్రాంతుల్ని చేస్తోంది. గత ఏడాది కరోనా వైరస్ ముఖ్యంగా వృద్ధుల్ని టార్గెట్ చేస్తే..ఈసారి కరోనా వైరస్ సెకండ్ వేవ్ (Corona second wave)మాత్రం యువకుల్ని లక్ష్యంగా చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇదే ఇప్పుడు ఆందోళనకరంగా మారింది. ముఖ్యంగా యువకులు, మధ్య వయస్కులపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నట్టు బెంగళూరు వైద్యులు గుర్తించారు. సెకండ్ వేవ్ ప్రభావం వృద్ధులపై కన్పించడం లేదని తెలిపారు. కరోనా వైరస్ కేసులు పెరిగినప్పటి నుంచి బెంగళూరులో 20-39 మధ్య వయస్సున్న వ్యక్తులే ఎక్కువగా కరోనా వైరస్ బారిన పడుతున్నట్టు నిర్ధారించారు వైద్యులు. వైరస్ ట్రాన్సెబిలిటీ పెరగడం, ప్రజల వ్యవహారశైలే దీనికి కారణమని వైద్యలు చెబుతున్నారు. 


35-40 ఏళ్ల వయస్సువారు ఎక్కువ మంది కరోనా బారిన పడుతున్నారని సీఎంఏ ఆసుపత్రి డాక్టర్ బ్రూనా తెలిపారు. మొదటి వేవ్‌తో పోలిస్తే..సెకండ్ వేవ్ ప్రసార రేటు ఎక్కువని..వ్యాక్సిన్అం ( Vaccine) అందుబాటులో రావడంతో ప్రజలు కదలిక ఎక్కువై వైరస్ వ్యాప్తి రేటు ( Coronavirus spread rate)పెరిగిందన్నారు. వ్యాక్సిన్ తీసుకునేవారి వయస్సును 35 సంవత్సరాలకు తగ్గించాలని కోరారు. కేసులు పెరుగుతున్నందున ప్రజలు కూడా జాగ్రత్తలు వహించాలన్నారు. 


ఇక సెకండ్ వేవ్‌లో కూడా గత ఏడాది చూసినట్టే మరణాలు చూడాల్సి వస్తుందని..కానీ ఆ దశకు వెళ్లకుండా చూసుకోవాలన్నారు. ఐసీయూ పడకలు పెంచడం ప్రారంభించాలని, వ్యాక్సిన్ అందుబాటులో ఉంచాలని యశ్వంత్‌పూర్‌లోని కొలంబియా ఆసియా రెఫరల్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ ప్రదీప్ రంగప్ప తెలిపారు. 


Also read: Karnataka: సమ్మెకు దిగితే ఉద్యోగాలు తీసేయాల్సిందే : కర్నాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook