Corona Second Wave: కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది.  రికార్డు స్థాయిలో  కేసులు నమోదవుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో పరిస్థితి ఇంకా ఉధృతంగానే ఉండగా..మరికొన్ని రాష్ట్రాల్లో మాత్రం కోవిడ్ పెరుగుదల నిలిచిందని తెలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో కరోనా సెకండ్ వేవ్ ( Corona Second Wave) ప్రతాపం చూపిస్తోంది. దేశవ్యాప్తంగా రోజుకు 4 లక్షల కేసులకు చేరుకుందంటే పరిస్థితి ఎలా ఉందో అర్దం చేసుకోవచ్చు. అయితే రాష్ట్రాలవారీగా చూస్తే ఉపశమనం కలిగే సమాచారం లభిస్తోంది. కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా చేసిన ప్రకటన ఊపిరి పీల్చుకునేలా చేస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో ఊహించినదానికంటే ముందే కోవిడ్ కేసుల పెరుగుదల నిలిచిపోయిందని వెల్లడించింది. రోజువారీ కేసుల సంఖ్యలో తగ్గుదల కన్పిస్తోందని తెలిపింది. అదే సమయంలో ఇంకొన్ని రాష్ట్రాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని పేర్కొంది. తెలంగాణ, ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, పంజాబ్ సహా 13 రాష్ట్రాల్లో రోజువారీ కేసుల్లో స్థిరీకరణ కన్పిస్తోందని కేంద్ర ఆరోగ్య శాఖ ( Union Health Ministry) స్పష్టం చేసింది.


అటు బీహార్, రాజస్థాన్, సిక్కిం, తమిళనాడు(Tamilnadu), త్రిపుర, పశ్చిమ బెంగాల్‌(West Bengal)లలో మాత్రం ఆందోళనకరస్థాయిలో రోజువారీ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఢిల్లీ(Delhi)లో ఏప్రిల్ 24వ తేదీన 25 వేల 294 కేసులు నమోదు కాగా, మే 2వ తేదీ 24 వేల 253 కేసులు నమోదయ్యాయి. ఛత్తీస్‌గఢ్‌లో ఏప్రిల్ 29న 15 వేల 583 కేసులు నమోదు కాగా.మే 2వ తేదీన 14 వేల 87 కేసులు నమోదయ్యాయి. ఇక ఢిల్లీ, గుజరాత్, మధ్యప్రదేశ్, జార్ఘండ్, యూపీ, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో కూడా అదే విధంగా కేసులు నమోదవుతున్నాయి. తెలంగాణ(Telangana)లోని కొన్ని జిల్లాల్లో కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. రాష్ట్రస్థాయిలో కేసుల్ని నియంత్రించేందుకు మరింత కృష్టి చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది.


అస్సాం, కర్నాటక(Karnataka), కేరళ, ఒడిశా, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో కేసుల సంఖ్య. ఆందోళనకర స్థాయిలో పెరుగుతోంది. ప్రస్తుతం గుజరాత్, మహారాష్ట్ర, హర్యానా, పశ్చిమ బెంగాల్, కర్నాటక, కేరళ వంటి 12 రాష్ట్రాల్లో లక్షకు పైగా యాక్టివ్ కేసులున్నాయి. మరో 7 రాష్టాల్లో 50 వేల నుంచి లక్ష వరకూ యాక్టివ్ కేసులున్నాయి.


Also read: Tamil Nadu Assembly Election 2021 Results: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమైన అభ్యర్థులు.. వారి గెలుపు, ఓటములు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook