India: 3 కోట్లు దాటిన కరోనా పరీక్షలు
భారత్‌లో కరోనావైరస్ ( Coronavirus ) మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. నిరంతరం కోవిడ్19 కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకు దేశంలో కరోనా మరణాల సంఖ్య 50వేలు దాటింది. అంతేకాకుండా దేశంలో ఇప్పటివరకు 3కోట్లకు పైగా కరోనా నమూనాలను పరీక్షించారు.
Covid-19 Cases in India: న్యూఢిల్లీ: భారత్‌లో కరోనావైరస్ ( Coronavirus ) మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. నిరంతరం కోవిడ్19 కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకు దేశంలో కరోనా మరణాల సంఖ్య 50వేలు దాటింది. అంతేకాకుండా దేశంలో ఇప్పటివరకు 3కోట్లకు పైగానే కరోనా నమూనాలను పరీక్షించారు. గత 24 గంటల్లో ( ఆదివారం ) కొత్తగా 57,982 కరోనా కేసులు నమోదు కాగా.. 941 మంది ఈ మహమ్మారి కారణంగా మరణించారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ( Health Ministry ) సోమవారం వెల్లడించింది. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 26,47,664 కు పెరగగా.. మరణాల సంఖ్య 50,921కు చేరింది. Also read: Neeli Neeli Aakasam Song: 'నీలి నీలి ఆకాశం' మరో రికార్డ్
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 6,76,900 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 19,19,843 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకున్నారు. అయితే.. ఆదివారం 7,31,697 కరోనా నమూనాలను పరీక్షించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ( ICMR ) తెలిపింది. ఇప్పటివరకు (ఆగస్టు 16) దేశవ్యాప్తంగా 3,00,41,400 కరోనా టెస్టులు చేసినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. Also read: Fire Accident: పార్లమెంట్ భవనంలో అగ్నిప్రమాదం