Covid Updates: దేశంలో మళ్లీ పెరిగిన కోవిడ్ కేసులు
Coronavirus Updates: 13,26,399 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా.. 15,823 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. అంతక్రితం రోజుకంటే 1,500కు పైగా కేసులు పెరిగాయి.
Coronavirus Update India Records 15,823 New Covid Cases: దేశంలో కరోనా కేసుల విషయంలో హెచ్చుతగ్గులున్నాయి. ఇక తాజాగా కోవిడ్ కేసులు (Covid cases) 15 వేలకు చేరాయి. మృతుల సంఖ్య కూడా 200కు పైగానే ఉంది. అయితే క్రియాశీల కేసులు (Active cases) కాస్త క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. ఈ మేరకు బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలను వెల్లడించింది.
Also Read : Huzurabad bypoll latest updates: హుజూరాబాద్ ఉప ఎన్నిక పోటీలో నిలిచేదెవరో తేలనుంది, నేడే గుర్తుల కేటాయింపు
మంగళవారం 13,26,399 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా.. 15,823 మందికి వైరస్ పాజిటివ్‌గా (Positive) తేలింది. అంతకు క్రితం రోజుకంటే 1,500కు పైగా కేసులు పెరిగాయి. ఇక నిన్న 22,844 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. మరో 226 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు దేశంలో 3.40 కోట్ల మందికి కరోనా (Corona) సోకింది. అందులో 3.33 కోట్ల (98.06 శాతం) మంది కోలుకున్నారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల (Active cases) సంఖ్య 2,07,653 గా ఉంది. 4,51,189 మంది చనిపోయారు. కరోనాను (Corona) కట్టడి చేసేందుకు కేంద్రం టీకా కార్యక్రమాన్ని కూడా వేగవంతం చేసింది. నిన్న 50.63 లక్షల మంది టీకా వేయించుకున్నారు. ఇప్పటివరకు పంపిణీ అయిన డోసుల (Doses) సంఖ్య 96.43 కోట్లను దాటింది.
Also Read : David Warner slams SRH: సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై డేవిడ్ వార్నర్ ఫైర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook