శ్రీనగర్: కరోనావైరస్(Coronavirus) మహమ్మారి ప్రపంచమంతటా మిలియన్ల మందిని కలవరపెట్టడమే కాకుండా, దేశంలో రోజుకో మూలకు చుట్టుకుంటుంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా భయకంపితుల్ని చేయడమే కాకుండా, మారుతున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా  ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందోనన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇప్పటివరకు దేశం మొత్తమ్మీద 31 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా, నేడు జమ్మూ కాశ్మీర్లోని పౌరుడికి కరోనా పాజిటివ్ అని తేలడంతో దీని బాధితుల సంఖ్య 32కి చేరింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read Also: కరోనా వైర‌స్‌పై స్పందించిన ప్రధాని మోదీ


 కోవిడ్ -19(కరోనా వైరస్) ఇప్పుడు 90 దేశాలలో వ్యాపించిందని, 3,400 మంది దీని బారిన పడి మరణించారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. కరోనావైరస్ సోకిన కారణంగా శనివారం 28 కొత్త మరణాలతో పాటు 99 కొత్త కేసులు నమోదయ్యాయని, వుహాన్ లోని ఒక సీఫుడ్  పౌల్ట్రీ మార్కెట్ నుండి సంభవించిన, కోవిడ్ -19, చైనా దాని సరిహద్దులు దాటి ప్రపంచ దేశాలను ప్రభావితం చేసింది. ఇరాన్, వాటికన్ లోని ప్రార్థనా స్థలాలు ఇప్పటికే మూతపడిపోయాయి.


Read Also: వాళ్లకు కరోనా లేదట.. అయినాసరే ఇంట్లోంచి బయటికి వెళ్లొద్దని ఆదేశాలు!


మరోవైపు ప్రతి నాలుగేళ్లకొకసారి అంతర్జాతీయంగా ప్రతిష్టాత్మకంగా జరిగే ఒలింపిక్స్, ఈ సంవత్సరంలో జపాన్ వేదికగా జరగనున్నాయి. కరోనా వైరస్ కలకలం నేపథ్యంలో నిర్వాహకులు తలలు పట్టుకుంటున్నారు. కాగా వాతావరణ పరిస్థితుల దృష్ట్యా సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని వివరణిచ్చారు.
జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..


Read Also: ఒకే కుటుంబంలో ఏడుగురికి కరోనా వైరస్ పాజిటివ్..