PM Narendra Modi On COVID-19: కరోనా వైర‌స్‌పై స్పందించిన ప్రధాని మోదీ

ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న ప్రాణాంతక కరోనా వైరస్ (#COVID-19) గురించి ఏ ఆందోళన అక్కర్లేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

Last Updated : Mar 3, 2020, 03:09 PM IST
PM Narendra Modi On COVID-19: కరోనా వైర‌స్‌పై స్పందించిన ప్రధాని మోదీ

ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న ప్రాణాంతక కరోనా వైరస్ (#COVID-19) గురించి ఏ ఆందోళన అక్కర్లేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. తాజాగా ఢిల్లీలో, రాజస్థాన్ జైపూర్‌లో, తెలంగాణాలో తాజాగా గాంధీ ఆస్పత్రిలో 8 కరోనా పాజిటీవ్ కేసులు నమోదైన విషయం తెలిసిందే. 90వేలకు పైగా కేసులు నమోదు కాగా, పూర్తి స్థాయిలో వాక్సిన్, మందు కనిపెట్టేందుకు వైద్య నిపుణులు ప్రయత్నాలు చేస్తున్నారు.

చైనా నుంచి మహమ్మారి కరోనా వైరస్ భారీ స్థాయిలో భారత్‌ను తాకడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దీనిపై కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులతో ప్రధాని నరేంద్ర మోదీ సమీక్ష జరిపారు. విదేశాల నుంచి వచ్చే భారత కరోనా బాధితులకు వైద్యులు తక్షణమే చికిత్స అందిస్తారని ట్వీట్ చేశారు.

కరోనా వైరస్ గురించి ఏ ఆందోళన అక్కర్లేదని, మనమంతా కలిసికట్టుగా పనిచేసి వైరస్‌ను రూపుమాపుదామని మోదీ పిలుపునిచ్చారు. కరోనాకు సంబంధి కంట్రోల్ రూమ్ నెంబర్ +91-11-23978046 ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని ట్వీట్ ద్వారా తెలిపారు. కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు జాగ్రత్తలు షేర్ చేశారు.

ప్రధాని షేర్ చేసిన జాగ్రత్తలు ఇవే:

  • తరచుగా చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.
  • ఇతరులకు కాస్త దూరంగా ఉండేలా చూసుకోవాలి.
  • పదే పదే కళ్లు, ముక్కు, నోటిని తాకకూడదు.
  • జ్వరం వచ్చినా, శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తినా తక్షణమే దగ్గర్లోని హాస్పిటల్‌కు వెళ్లాలి
  • మీ సంబంధిత డాక్టర్‌ను సంప్రదిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News