Coronavirus updates India logs fresh 14,146 COVID cases, over 19,000 recoveries in 24 hours; active cases decline to 1.95 lakh: దేశంలో కరోనా (Corona) క్రమంగా అదుపులోకి వస్తున్నట్లు అనిపిస్తోంది. తాజాగా కొత్త కేసులు 14 వేలకు దిగి వచ్చాయి. ఇక మరణాలు కూడా 150లోపే నమోదయ్యాయి. అలాగే రికవరీలు పెరుగుతున్నాయి. ఇక యాక్టివ్ కేసులు (Active cases) 1.95 లక్షల దిగువకు పడిపోయాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గడిచిన 24 గంటల్లో 11 లక్షల కరోనా నిర్ధారణ పరీక్షలు (Corona tests) నిర్వహించారు. 14,146 కొత్త కేసులు (New cases) నమోదు అయ్యాయి. ఇవి 229 రోజుల కనిష్ఠానికి చేరాయి. ఇక నిన్న 144 మరణాలు (Deaths) చోటు చేసుకున్నాయి. కొవిడ్‌తో (COVID) ఇప్పటి వరకూ చనిపోయిన వారి సంఖ్య 4,52,124కి చేరింది.


ఇక గడిచిన 24 గంటల్లో 19,788 మంది కొవిడ్‌ను జయించారు. దీంతో ఇప్పటి వరకూ కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 3,34,19,749కి చేరింది. రికవరీ రేటు (Recovery rate) 98.10 శాతానికి చేరింది. గతేడాది మార్చి తర్వాత ఈ స్థాయిలో రికవరీ రేట్ నమోదు కావడం ఇదే మొదటిసారి. 


Also Read : KCR campaign : దూకుడు పెంచిన టీఆర్‌ఎస్..27న హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ప్రచారానికి కేసీఆర్‌


ప్రస్తుతం కోవిడ్ యాక్టివ్ కేసులు (Covid Active Cases) 1,95,846కి పడిపోయాయి. మరోవైపు వ్యాక్సినేషన్‌ (Vaccination‌) డోసుల సంఖ్య వంద కోట్ల వైపు పరుగులు తీస్తోంది. నిన్న 41,20,772 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. దీంతో ఇప్పటి వరకు దేశంలో అందించిన వ్యాక్సినేషన్‌ (Vaccination‌) సంఖ్య 97.65 కోట్లు దాటింది. త్వరలోనే ఈ సంఖ్య వందకోట్లకు చేరనుంది.


Also Read : Kerala Heavy Rains: కేరళలో భారీ వర్షాలు, కొట్టుకుపోతున్న ఇళ్లు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి