Camphor in clothes: సాధారణంగా బట్టలు ఎక్కువ కాలం పాటు మన్నికగా ఉండటానికి సరైన జాగ్రత్తలు తీసుకుంటాం. అయితే, ఇందులో నాఫ్లలీన్ బాల్స్ వంటివి కూడా పెడతాం. అయితే, బట్టల మధ్యలో కర్పూరం బిళ్లలు పెట్టడం వల్ల ఏం జరుగుతుందో తెలుసుకుందాం.
ఖరీదైన బట్టలు పాడవ్వకుండా ఎక్కువ కాలం పాటు మన్నికగా ఉండటానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకంటాం. ముఖ్యంగా ఈ బట్టలు మన కేవలం ఏవైనా పండుగలు, వేడుకలు ఉన్నప్పుడే ధరిస్తాం. కాబట్టి ఎక్కువ సమయంపాటు కప్‌బోర్డ్ లోనే పెడతాం.
అయితే,సాధారణంగా కర్పూరాన్ని కేవలం పూజలోనే వాడతాం. లేదా హెయిర్ ఆయిల్స్‌లో కూడా ఉపయోగిస్తారు. అయితే, కర్పూరంలో మీ దుస్తులు ఎక్కువ కాలం పాటు మన్నికగా ఉంటాయంటే నమ్ముతారా?
సాధారణంగా ఎక్కువ కాలంపాటు అల్మైరాలో పెట్టిన దుస్తులు దుర్వాసన రావడం మీరు గమనిస్తారు . ఎందుకంటే వీటికి అప్పుడప్పుడు సూర్యరశ్మికి తగలాలి. లేదంటే బట్టలు మళ్లీ ఉతకాలి.
అవును, మీ ఖరీదైన బట్టల రంగు పోకుడా ఉండాలంటే, మీ బట్టల మధ్యలో కర్పూరాన్ని ఉంచాలి. ఇలా చేయడం వల్ల దుస్తుల రంగు ఎక్కువ కాలం పాటు మన్నికగా ఉంటాయి. ఆ దుస్తుల నుంచి కూడా సువాసన వెదజల్లుతుంది.
అంతేకాదు ఇలా చేయడం వల్ల మన దుస్తుల్లో కీటకాలు చేరవు. మీరు నిల్వ బట్టలు పెట్టుకున్న షెల్ఫ్‌లోని దుస్తులలో 5 కర్పూరం బిళ్లలు ఉంచాలి. ఎందుకంటే కర్పూరం వాసన కీటకాలను దూరంగా ఉంచుతుంది. (Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )