ఏపీ శ్రీహరికోట స్పేస్ స్టేషన్ నుంచి మరో శాటిలైట్ ప్రయోగానికి రంగం సిద్ధమైంది. PSLV C-50 ప్రయోగానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. కమ్యూనికేషన్ శాటిలైట్ CMS-01‌ను అంతరిక్షంలో ప్రవేశపెట్టనున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ( ISRO ) మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. PSLV C-50ని అంతరిక్షంలో పంపేందుకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. కమ్యూనికేషన్ శాటిలైట్ ( Communication satellite ) CMS-01ను PSLV C-50 ద్వారా అంతరిక్షంలో ప్రవేశపెట్టనున్నారు. డిసెంబర్ 17 వ తేదీ మధ్యాహ్నం 3 గంటల 41 నిమిషాలకు PSLV C-50 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. శ్రీహరికోట ( Sriharikota )లోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో ( Satish dhawan space centre ) ఉన్న సెకండ్ లాంచ్ ప్యాడ్ నుంచి ఈ రాకెట్ ప్రయోగం జరగనుందని ఇస్రో తెలిపింది. ఈ ప్రయోగం విజయవంతమైతే CMS-01 ద్వారా మెరుగైన బ్రాడ్ బ్యాండ్ సేవలు అందనున్నాయని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ శాటిలైట్ పరిమితి ఇండియాతో పాటు అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్ వరకూ విస్తరించనుంది. షార్ సెంటర్‌లో శాస్త్రవేత్తలు చివరి దశ పనుల్లో నిమగ్నమయ్యారు. 


ఇస్రో నిర్వహిస్తున్న ఈ ప్రయోగం ద్వారా 42వ కమ్యూనికేషన్ ఉపగ్రహం నింగిలోకి వెళ్తోంది. ఏడేళ్ల పాటు కక్షలో తిరగనున్న శాటిలైట్ బరువు మొత్తం 1410 కిలోలు. ఇప్పటికే ప్రారంభమైన కౌంట్‌డౌన్ ( Countdown ) 25 గంటల పాటు నిరంతరాయంగా కొనసాగనుంది. పీఎస్ఎల్వీ సీ 50 ఎక్స్‌ఎల్ ఆకృతిలో ఇది 22వదని ఇస్రో ప్రకటించింది. షార్ నుంచి 77వ మిషన్ అని ఇస్రో తెలిపింది. మరోవైపు రాకెట్ ప్రయోగం నేపధ్యంలో ఇస్రో శాస్త్రవేత్తలు తిరుమల శ్రీవారిని దర్శించుకుని పూజలు చేయనున్నారు. Also read: Spectrum auction: 5జి సేవల స్పెక్ట్రమ్ వేలానికి కేంద్రం ఆమోదం