Spectrum auction: 5జి సేవల స్పెక్ట్రమ్ వేలానికి కేంద్రం ఆమోదం

Spectrum auction: స్పెక్ట్రమ్ వేలానికి రంగం సిద్ధమైంది.  కేంద్ర కేబినెట్  అనుమతిచ్చింది. మరోవైపు చక్కెర ఎగుమతుల సబ్సిడీ, రేడియో వేవ్స్ అమ్మకానికి కూడా కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది.

Last Updated : Dec 16, 2020, 08:23 PM IST
  • 5జి స్పెక్ట్రమ్ వేలానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం
  • 60 లక్షల టన్నుల చక్కెర ఎగుమతుల సబ్సిడీలకు అనుమతి
  • కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర మంత్రివర్గం
Spectrum auction: 5జి సేవల స్పెక్ట్రమ్ వేలానికి కేంద్రం ఆమోదం

Spectrum auction: స్పెక్ట్రమ్ వేలానికి రంగం సిద్ధమైంది.  కేంద్ర కేబినెట్  అనుమతిచ్చింది. మరోవైపు చక్కెర ఎగుమతుల సబ్సిడీ, రేడియో వేవ్స్ అమ్మకానికి కూడా కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది.

కేంద్ర మంత్రివర్గం ( Union cabinet ) పలు కీలక నిర్ణయాలను ఆమోదించింది. వ్యవసాయం, టెలీకం, విద్యుత్ రంగాలకు సంబంధించి అనుమతులిచ్చింది. వీడియా కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమైన కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. చక్కెర రైతుల ఆందోళన నేపధ్యంలో 60 లక్షల టన్నుల చక్కెర ఎగుమతుల సబ్సిడీ ( 60 lakh tons of sugar export subsidy ) లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్రం. సబ్సిడీ సొమ్మును నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్టు కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ( Central minister prakash javadekar ) తెలిపారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా దేశవ్యాప్తంగా 5 కోట్ల మంది రైతులు, 5 లక్షల మంది కార్మికులకు ప్రయోజనం చేకూరనుందని మంత్రి చెప్పారు. Also read: JEE Mains 2021: జేఈఈ మెయిన్స్ కొత్త షెడ్యూల్ ఇవాళ విడుదల

మరోవైపు కీలకమైన స్పెక్ట్రమ్ వేలానికి ( Spectrum auction ) కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. 700 ఎంహెచ్‌జెడ్ నుంచి 800, 900, 2100, 2300, 2500 ఎంహెచ్‌జెడ్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్ల వేలానికి అనుమతి లభించింది. 20 ఏళ్ల గడువుతో నిర్వహిస్తున్న వేలం ద్వారా 2 వేల 251 రేడియా తరంగాల్ని అమ్మకానికి ఉంచారు. ఈ వేలం ద్వారా 3.92 లక్షల కోట్లు లభించవచ్చని కేంద్రం అంచనా వేసింది. వచ్చే ఏడాది మార్చ్ నెలలో ఈ వేలం జరగనుంది. 

ఇక కీలకమైన 5జీ సేవలకు ( 5g Services ) సంబంధించిన వేలానికి కూడా అనుమతిచ్చింది. 5జి సర్వీసుల కోసం ట్రాయ్ ( TRAI ) 300 ఎంహెచ్‌జెడ్‌ను ఎంపిక చేసింది. రక్షణ శాఖ మాత్రం 125 ఎంహెచ్‌జెడ్‌ను వినియోగించనుండటంతో 175 ఎంహెచ్‌జెడ్ మాత్రమే అందుబాటులో ఉండనుంది. దేశవ్యాప్తంగా 3300-3600 ఎంహెచ్‌జెడ్ బ్యాండ్‌లో ఒక్కో ఎంహెచ్ జెడ్‌కు 492 కోట్ల రూపాయల్ని బేస్ ధరగా నిర్ణయించారు. ఈ కారణంగా 100 ఎంహెచ్‌జెడ్ 5జీ వేవ్స్ వేలం ద్వారా 50 వేల కోట్లు రావచ్చని తెలుస్తోంది. Also read: Himalayas: అంతరిక్షం నుంచి హిమాలయాల అందాలు చూడండి!

Trending News