COVAXIN Price: రేపటి నుంచి దేశవ్యాప్తంగా 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ కరోనా ప్రికాషన్ టీకా తీసుకునేందుకు వీలు కలగనుంది, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం ప్రకారం.. ప్రైవేటు టీకా కేంద్రాల్లోనే ప్రికాషన్ డోసు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో టీకా డోసు ధర ఎంత ఉంటుందనే విషయంపై వ్యాక్సిన్​ తయారీ సంస్థలు స్పష్టతనిచ్చాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కొవాగ్జిన్ డోసు ధర భారీగా తగ్గింపు..


హైదరాబాద్​ కేంద్రంగా పని చేస్తున్న భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకా డోసు ధరను రూ.225కి తగ్గించింది కంపెనీ. ఈ విషయాన్ని సంస్థ జాయింట్​ ఎండీ సుచిత్ర ఎల్లా ట్విట్టర్​ ద్వారా వెల్లడించారు. ఇప్పటి వరకు కొవాగ్జిన్​ ఒక్క డోసు టీకా ధర రూ.1200గా ఉన్నట్లు తెలిపారు. టీకా ఉత్పత్తి సంస్థలతో కేంద్రం చర్చలు జరిపిన అనంతంరం ఈ ప్రకటన వెలువడటం గమనార్హం.



తగ్గిన కొవిషీల్డ్ ధర..


కేంద్రంతో చర్చల అనంతరం కొవిషీల్డ్​ ధరను కూడా తగ్గించినట్లు సీరమ్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్ ఇండియా (ఎస్​ఐఐ) సీఈఓ అదర్​ పూనావాలా ట్విట్​ చేశారు. ప్రస్తుతం రూ.600గా ఉన్న కొవిషీల్డ్​ ధరను (ఒక డోసు).. రూ.225కు తగ్గించినట్లు ట్విట్టర్​లో పేర్కొన్నారు.



గరిష్ఠ సర్వీస్​ ఛార్జ్​ ఎంతంటే..


టీకా ధరతో పాటు అదనంగా సర్వీస్​ ఛార్జ్​ చెల్లించాల్సి ఉంటుందని కేంద్రం తెలిపింది. అయితే ఈ ఛార్జీపైనా కేంద్రం పరిమితులు విధించింది. గరిష్ఠంగా రూ.150 వసూలు చేయాలని సూచించింది.


Also read: Sikkim Govt vs Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు షాక్.. పనిచేయని ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఓ ప్రత్యేక విభాగం


Also read: Aadhar Download: మొబైల్ నంబరు లేకుండానే ఇకపై ఆధార్ కార్డు డౌన్ లోడ్ చేసుకోవచ్చు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook