Sikkim Govt vs Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు షాక్.. పనిచేయని ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఓ ప్రత్యేక విభాగం

sikkim govt action against lazy govt employees: కొన్నిసార్లు ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలను అభినందించకుండా ఉండలేం. వ్యవస్థలో ఉండే జాడ్యాన్ని పోగొట్టడానికి.. ధైర్యంగా తీసుకునే కఠిన నిర్ణయాలకు శభాష్ చెప్పడం తప్పేంకాదు. ఇలాంటి ఓ నిర్ణయం తీసుకొని జనంతో చప్పట్లు కొట్టించుకుంటోంది సిక్కిం సర్కార్.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 9, 2022, 04:33 PM IST
  • పనిచేయకుండా.. అడ్డంకులు సృష్టించే ఉద్యోగుల కోసం ప్రత్యేక శాఖ
  • పనిచేయని వారిని ఆ విభాగంలోకి బదిలీ చేసేలా ఏర్పాట్లు
  • పనికిమాలిన శాఖకు బదిలీ అంటే అతడిపై స్టాంప్ పడినట్టే..
Sikkim Govt vs Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు షాక్.. పనిచేయని ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఓ ప్రత్యేక విభాగం

sikkim govt action against lazy govt employees: గ్యాంగ్‌టక్: కొన్నిసార్లు ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలను అభినందించకుండా ఉండలేం. వ్యవస్థలో ఉండే జాడ్యాన్ని పోగొట్టడానికి.. ధైర్యంగా తీసుకునే కఠిన నిర్ణయాలకు శభాష్ చెప్పడం తప్పేంకాదు. ఇలాంటి ఓ నిర్ణయం తీసుకొని జనంతో చప్పట్లు కొట్టించుకుంటోంది సిక్కిం సర్కార్. భౌగోళికంగా చిన్న రాష్ట్రమే అయినా.. అందరికీ ఆదర్శంగా నిలిచేలా కీలకమైన ముందడుగు వేసింది.

బేసిగ్గా గవర్నమెంట్ ఆఫీసులంటేనే బద్దకానికి కేరాఫ్ అడ్రస్ అనేది జనంలో ఉండే అభిప్రాయం. నత్తనడకన పనులు, జీతాల విషయంలో గొంతెమ్మ కోర్కెలు, ఆమ్యామ్యాలు లేనిదే ఏ పనులు కావన్న అపవాదు. ఇవన్నీ తెలిసినా ప్రభుత్వాలు మాత్రం వారిజోలికి వెళ్లాలంటేనే భయపడతాయి. పొరపాటున వారికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే ఎక్కడ తమ ప్రభుత్వాలకు ఎసరొస్తుందేమోనని సైలెంట్‌గా ఉంటుంటాయి. రాష్ట్ర ఆదాయంలో మెజార్టీ భాగం వారి జీతభత్యాలకే సరిపోతున్నా.. మౌనంగా వారిని మోస్తూ ఉంటాయి. అయితే అందరూ ఇలాగే అని కాదు. కొంతమంది చాలా సిన్సియర్‌‌గా పనిచేసి ప్రజల మన్ననలు అందుకునే ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉంటారు. మరికొందరు మాత్రం పనిచేయకుండా.. పనిలో అడ్డంకులు సృష్టిస్తూ ఉంటుంటారు. వీళ్లే మొదటి కోవకు చెందిన ఉద్యోగులుగా చెప్పుకోవచ్చు.

ఇలా పనిచేయకుండా.. అడ్డంకులు సృష్టించే ఉద్యోగులను పొమ్మనకుండా పొగపెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది సిక్కిం ప్రభుత్వం. వివిధ శాఖల్లో ఇలాంటి ఉద్యోగులను గుర్తించి ప్రత్యేక శాఖకు బదిలీలను ప్రారంభించింది. పనికిమాలిన ఉద్యోగుల శాఖ అనే ఓ ప్రభుత్వ శాఖను క్రియేట్ చేసి.. వారిని ఆ విభాగంలోకి బదిలీ చేస్తోంది. ఈ విభాగంలో చేయడానికి పనేమీ ఉండదు. ఫైల్స్, వర్క్ టైమింగ్స్,ఆఫీసులు కూడా ఉండవు. దీంతో ఆ ఉద్యోగి నామమాత్ర గవర్నమెంటు ఎంప్లాయిగా మిగిలిపోతాడు. నెలనెలా జీతభత్యాలు మాత్రం చెల్లిస్తారు. వారిష్టమైతే అందులో ఉండొచ్చు. లేదంటే రాజీనామా చేసి వెళ్లిపోవచ్చు. ఇదీ ప్రభుత్వ ఉద్దేశ్యం. కొత్తగా ఏర్పాటు చేసిన ఈ విభాగం హోంశాఖ పరిధిలో పనిచేయాల్సి ఉంటుంది.

అన్నట్టు ఇందులో ఇంకో మతలబు కూడా ఉందండోయ్.. ఈ శాఖకు బదిలీ అయిన ఉద్యోగులకు బేసిక్ శాలరీ తప్ప ఇంకే ఇతర అలవెన్సులు, ప్రభుత్వ ఫలాలు కూడా వర్తించవు. పనికిమాలిన ఉద్యోగులకు ప్రభుత్వం ఇచ్చే మరో పనిష్మెంట్ ఇది. సూపర్ ఉంది కదూ.. దీనిపై ఇప్పటికే సిక్కిం సీఎం ప్రేమ్‌సింగ్ తమాంగ్ ఆదేశాలు కూడా జారీచేశారు. పనిచేయని ఉద్యోగులను భర్తరఫ్ చేయడం, కోర్టుల నుంచి తలనొప్పులు, ఉద్యోగ సంఘాల బాధలు ఇవన్నీ లేకుండా సిక్కిం సర్కారు (Sikkim govt) తీసుకున్న నిర్ణయాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు. కొందరు పనిచేయకుంటే రూపాయి నష్టం, పనిచేస్తే పది రూపాయల నష్టం. అలాంటివారి కోసమే ఇప్పుడీ స్కీం. బాగుందికదూ...

Also read : Shashi Tharoor Memes: మహిళా ఎంపీతో ముచ్చట్లు.. సోషల్ మీడియాలో కాంగ్రెస్ ఎంపీపై ఫన్నీ మీమ్స్!

Also read : Aadhar Download: మొబైల్ నంబరు లేకుండానే ఇకపై ఆధార్ కార్డు డౌన్ లోడ్ చేసుకోవచ్చు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News