Covid-19 cases in India : దేశంలో ప్రస్తుతం కొవిడ్‌‌-19 (COVID-19) థర్డ్ వేవ్ విజృంభిస్తోంది. కొద్దిరోజులుగా కొవిడ్ కేసుల్లో కాస్త తగ్గుదల కనిపిస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వ వర్గాల నుంచి ఊరటనిచ్చే ఒక విషయం వచ్చింది. ఫిబ్రవరి 15 నాటికి కొవిడ్ కేసులు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందంటూ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అలాగే కొవిడ్ వ్యాక్సినేషన్స్ థర్డ్‌ వేవ్ (Third wave) ప్రభావాన్ని తగ్గించాయని పేర్కొన్నాయి. అలాగే ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు, మెట్రో నగరాల్లో కేసులు తగ్గడం లేదా స్థిరంగా ఉండటం ప్రారంభమైందంటూ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక జనవరి 24న 3,06,064 కొవిడ్ కేసులు (Covid cases) వెలుగుచూశాయి. జనవరి 23న 3.33 లక్షలు, జనవరి 22న 3.37 లక్షలు, జనవరి 21న 3.47 లక్షల కొవిడ్ కేసులు నమోదయ్యాయి.


కొద్దిరోజులుగా కొత్త కేసులు మూడు లక్షలపైగానే వస్తున్నా.. మూడురోజులుగా వాటిలో కాస్త తగ్గుదల కనిపిస్తోంది. మరోపక్క ప్రస్తుతం దేశంలో 74 శాతం మంది వయోజనులు వ్యాక్సినేషన్ రెండు డోసులు పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం 15 నుంచి 18 మధ్య వయసు వారికి వ్యాక్సినేషన్ కొనసాగుతోంది.


60 ఏళ్లు దాటి ఇతర అనారోగ్యాలతో బాధపడుతున్నవారికి, ఫ్రంట్‌లైన్ సిబ్బందికి, ఆరోగ్య సిబ్బందికి కూడా బూస్టర్ డోస్‌ ఇస్తున్నారు. దీంతో థర్డ్ వేవ్‌ తీవ్రత తగ్గిందని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి.


Also Read : AP Corona Cases Today: ఏపీలో మళ్లీ పెరిగిన కొవిడ్ ఉద్ధృతి.. 15 వేలకు చేరువలో కరోనా కేసులు


ఇక జనవరి నెల ప్రారంభంలో కొవిడ్ కొత్త కేసులు భారీగా పెరిగాయి. ఇందుకు కొవిడ్ కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ (Omicron) ప్రధాన కారణం. అయితే ఈ వేరియంట్ వ్యాప్తి తీవ్ర స్థాయికి చేరుకోవడంతో రానున్న కొన్ని రోజులు మాత్రమే కొవిడ్ కేసులు భారీగా పెరుగుతాయని, తర్వాత తగ్గుతాయని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం కొవిడ్ (Covid) కొత్త కేసుల్లో ఆకస్మిక పెరుగుదల కనిపించవచ్చని... దీంతో ఆందోళన చెందవద్దని చెబుతున్నారు. అలాగే ఏ మాత్రం అజాగ్రత్తగా ఉండొద్దని సూచిస్తున్నారు.


Also Read : SS Thaman on Bheemla Nayak: పవన్ కల్యాణ్ కెరీర్ లోనే ది బెస్ట్ మూవీ భీమ్లా నాయక్: తమన్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook