Covid 19 Cases Updates: నిన్నటి కన్నా తగ్గిన కరోనా కొత్త కేసులు.. యాక్టివ్ కేసుల్లోనూ తగ్గుదల..
Covid 19 Cases Updates: దేశంలో కరోనా కొత్త కేసులు 10 వేల మార్క్‌కి దిగువనే నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కోవిడ్ కేసుల అప్డేట్స్ ఇవే..
Covid 19 Cases Updates: గత కొద్ది రోజులుగా దేశంలో కరోనా కొత్త కేసుల సంఖ్య 10 వేలకు దిగువనే నమోదవుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 6809 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్నటి (సెప్టెంబర్ 3)తో పోలిస్తే కొత్త కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. కరోనాతో గడిచిన 24 గంటల్లో మరో 26 మంది మృతి చెందారు. ఇందులో ఐదు మరణాలు కేరళలో నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,44,56,535కి చేరింది. ఇప్పటివరకూ కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 5,27,991కి చేరింది.
ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 55,114గా ఉంది. నిన్నటి కన్నా ఇవాళ 1631 యాక్టివ్ కేసులు తక్కువగా నమోదయ్యాయి. మొత్తం కరోనా కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 0.12 శాతంగా ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 8414 మంది పేషెంట్లు కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో దేశంలో కరోనా రికవరీల సంఖ్య 4,38,73,430కి చేరింది. జాతీయ స్థాయిలో కోవిడ్ రికవరీ రేటు 98.69 శాతంగా ఉంది.
గడిచిన 24 గంటల్లో మరో 3,20,820 కరోనా టెస్టులు నిర్వహించారు. దీంతో ఇప్పటివరకూ నిర్వహించిన కరోనా టెస్టుల సంఖ్య 88.71 కోట్లకు చేరింది. ప్రస్తుతం కరోనా వీక్లీ పాజిటివిటీ రేటు 2.29 శాతంగా ఉంది. ఇక కరోనా వ్యాక్సినేషన్ విషయానికొస్తే.. గడిచిన 24 గంటల్లో 19,35,814 డోసులు వేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 213.20 కోట్ల డోసులు వేశారు. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఈ ఏడాది జూలైలో భారత్ 200 కోట్ల మైలురాయిని చేరిన సంగతి తెలిసిందే. ప్రపంచంలో అతి తక్కువ కాలంలో 200 కోట్ల వ్యాక్సిన్ డోసులు వేసిన రెండో దేశంగా భారత్ నిలిచింది.
Also Read: Jana Gana Mana Shelved: లైగర్ డిజాస్టర్ రెస్పాన్స్.. 'జనగణమన'కు మంగళం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook