Covid-19 fourth wave: దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు... కొత్త కేసులు ఎన్నంటే?
India Covid: దేశవ్యాప్తంగా కరోనా కేసులు స్పల్పంగా తగ్గుముఖం పట్టాయి. కొత్తగా 2,202 మంది వైరస్ బారిన పడ్డారు.
India Covid-19 update: దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. తాజాగా 2,202 కొత్త కొవిడ్ కేసులు (Corona Cases in India) వెలుగుచూశాయి. వైరస్ తో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. మహమ్మారి నుంచి కోలుకుని నిన్న ఒక్కరోజే 2,550 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జయ్యారు. రికవరీ అయినవారి సంఖ్య 98.74 శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా 17,317 (0.04 శాతం) యాక్టివ్ కేసులున్నాయి.
ఇప్పటి వరకు నమోదైన మెుత్తం కరోనా కేసుల సంఖ్య 4,31,23,801కి చేరింది. వైరస్ తో ఇప్పటి వరకు మరణించినవారి సంఖ్య 5,24,241గా ఉంది. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ (Covid-19 Vaccination in india) పంపిణీ కొనసాగుతోంది. ఆదివారం ఒక్కరోజే 3లక్షల మందికిపైగా టీకాలు అందించారు. మెుత్తంగా ఇప్పటి వరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 191 కోట్ల 37 లక్షల 34 వేలు దాటింది. గడిచిన 24 గంటల్లో 2 లక్షల 97 వేల 242 మందికి కరోనా పరీక్షలు చేశారు.
ప్రపంచవ్యాప్తంగా కరోనా కల్లోలం కొనసాగుతోంది. అమెరికాలో మరో 42వేల కొత్త కేసులు రాగా..వైరస్ తో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. జపాన్‌లో కొత్తగా 38వేల మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దక్షిణ కొరియా, ఇటలీ, ఫ్రాన్స్‌లో కూడా కరోనా కేసులు భారీగా నమోదువుతున్నాయి. అక్కడ సగటున రోజుకు 35వేలకుపైగా కేసులు వెలుగుచూస్తున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి