Covid-19 guidelines: బెంగళూరులో షాపింగ్ మాల్స్, సినిమా హాల్స్, పబ్స్‌కి కొవిడ్-19 మార్గదర్శకాలు
Covid-19 guidelines in Bengaluru: కర్ణాటకలో కరోనావైరస్ కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే ప్రజల కదలికలపై తీవ్ర ఆంక్షలు విధించిన కర్ణాటక సర్కార్ తాజాగా శుక్రవారం నాడు పబ్బులు, షాపింగ్ మాల్స్, సినిమా హాల్స్ విషయంలో కొత్తగా మరిన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది.
Covid-19 guidelines in Bengaluru: కర్ణాటకలో కరోనావైరస్ కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే ప్రజల కదలికలపై తీవ్ర ఆంక్షలు విధించిన కర్ణాటక సర్కార్ తాజాగా శుక్రవారం నాడు పబ్బులు, షాపింగ్ మాల్స్, సినిమా హాల్స్ విషయంలో కొత్తగా మరిన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. బెంగళూరు అర్బన్ జిల్లాతో పాటు రూరల్ జిల్లాలు అయిన బీబీఎంపీ, మైసూరు, కాలబురగి, దక్షిణ్ కన్నడ, ఉడుపి, బీదర్, హుబలి, దార్వాడ్ జిల్లాల్లోని పబ్బులు, బార్స్, క్లబ్బులు, రెస్టారెంట్స్‌లో కస్టమర్స్ 50 శాతానికి మించి ఉండరాదు.
అలాగే బెంగళూరు అర్బన్, బీబీఎంపీ, మైసూరు, కాలబురగి, దక్షిణ్ కన్నడ, ఉడుపి, బీదర్, హుబలి, దార్వాడ్ జిల్లాల్లోని థియేటర్లలోనూ 50 శాతానికి మించి ఆక్యుపెన్సీ ఉండరాదు. ఇక మార్కెట్స్, షాపింగ్ మాల్స్, దుకాణాలు లాంటి జన సందోహం ఉండే చోట మాస్కులు ధరించడం, సోషల్ డిస్టన్సింగ్ (wearing masks, social distancing) పాటించడం, హ్యాండ్ శానిటైజర్ వినియోగం తప్పనిసరి చేస్తూ కర్ణాటక సర్కార్ (Karnataka govt) ఆదేశాలు జారీచేసింది.
Also read : CRPF jobs 2021: సీఆర్‌పీఎఫ్‌లో రూ. 85 వేలతో ఉద్యోగం.. అర్హతలు, ఏజ్ లిమిట్ వివరాలు
స్కూల్ పిల్లల విషయానికొస్తే, 6-9 తరగతులను రద్దు చేసిన సర్కార్, జిమ్స్, స్విమ్మింగ్ పూల్స్ మూసే ఉంటాయని స్పష్టంచేసింది. ర్యాలీలు, ధర్నాలపై నిషేధం కొనసాగుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook