Covid cases in India:  దేశంలో కరోనా కేసులు(Coronavirus update) గత కొద్ది రోజులుగా తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా కొవిడ్ కేసులు 13వేలకు పడిపోయాయి. కొత్త కేసులు 231 రోజులు, క్రియాశీల కేసులు 227 రోజుల కనిష్ఠానికి క్షీణించాయి. మరణాల సంఖ్య 200 దిగువనే నమోదైంది. మంగళవారం కేంద్ర ఆరోగ్య శాఖ ఈ గణాంకాలను విడుదల చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సోమవారం 11,81,314 మంది కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. వారిలో 13,058 మందికి వైరస్ పాజిటివ్‌(Covid cases in India)గా తేలింది. అంతక్రితం రోజుకంటే కొత్త కేసులు 500 మేర తగ్గాయి. నిన్న 19,470 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు 3,40,94,373 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. అందులో 3,34,58,801 మంది వైరస్‌ను జయించారు. 


Also read:రన్నింగ్ రైలు నుండి దిగబోతూ కిందపడబోయిన గర్భిణీ.. కాపాడిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్


ఇటీవల కాలంలో వైరస్ వ్యాప్తి అదుపులో ఉండటంతో క్రియాశీల కేసులు(Active Cases) గణనీయంగా తగ్గుముఖం పడుతున్నాయి. ప్రస్తుతం ఆ కేసుల సంఖ్య 1,83,118గా ఉంది. క్రియాశీల రేటు 0.54 శాతానికి తగ్గగా.. రికవరీ రేటు(Recovery Rate) 98.14 శాతానికి పెరిగింది. నిన్న 164 మంది ప్రాణాలు(Covid Deaths) కోల్పోయారు. మొత్తంగా 4,52,454 మంది మరణించారు. మరోపక్క కరోనా టీకా(Vaccination) కార్యక్రమ వేగం పుంజుకుంది. నిన్న 87,41,160 మంది టీకా వేయించుకున్నారు. ఇప్పటివరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 98 కోట్ల మార్కును దాటేసి.. 100 కోట్లకు చేరువవుతోంది.


ప్రపంచవ్యాప్తంగా..


ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభణ (coronavirus worldwide) కొనసాగుతోంది. కొత్తగా 3,42,986 మందికి వైరస్ ​(Corona update) సోకింది. కొవిడ్​​ ధాటికి మరో 4,921 మంది మరణించారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 24,18,70,992 కు చేరింది. మొత్తం మరణాల సంఖ్య 49,20,294 కు పెరిగింది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి