COVID-19 New Strain: దేశంలో 38కి చేరిన కొత్త రకం కరోనా కేసులు
దేశంలో కోవిడ్-19 మహమ్మారి కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే కొత్త రకం కరోనా ఆందోళన సైతం మొదలైంది. దీనివల్ల ప్రమాదం తక్కువని నిపుణులు చెబుతున్నప్పటికీ.. ఇది వేగంగా వ్యాపిస్తుందని పేర్కొంటున్నారు.
New strain of COVID-19 from UK | న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్-19 మహమ్మారి కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే కొత్త రకం కరోనా ఆందోళన సైతం మొదలైంది. దీనివల్ల ప్రమాదం తక్కువని నిపుణులు చెబుతున్నప్పటికీ.. ఇది వేగంగా వ్యాపిస్తుందని పేర్కొంటున్నారు. అయితే దేశంలో తాజాగా మరో తొమ్మిది మందిలో బ్రిటన్ స్ట్రైయిన్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో దేశంలో కొత్త రకం (New strain of COVID-19) కరోనా కేసుల సంఖ్య 38కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం వెల్లడించింది.
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరాల ప్రకారం..
ఢిల్లీలోని ఐజీఐబీలో 11, న్యూఢిల్లీలోని ఎన్‌సీడీసీలో 8, బెంగళూరులోని ఎన్‌ఐఎంహెచ్‌ఏఎన్‌ఎస్‌లో 10, పూణేలోని ఎన్‌ఐవీలో 5, హైదరాబాద్‌లోని సీసీఎంబీలో 3, కోల్‌కతాలోని ఎన్‌సీబీజీలో 1 కేసు చొప్పున కొత్త రకం కరోనావైరస్‌ను నిర్ధారించినట్లు (Health Ministry) వివరించింది. అయితే కొత్తరకం కరోనా కేసులు జనవరి 1కి 29 ఉండగా.. తాజాగా పెరిగిన కేసులతో ఈ సంఖ్య 38కి చేరింది. వీరందరిని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నాయి. దీంతోపాటు వారి కాంటాక్టింగ్‌ను కూడా అధికారులు ట్రేస్ చేస్తున్నారు. Also read: Health Experts: భారత్‌లో హెర్డ్ ఇమ్యూనిటీ.. కొత్త స్ట్రెయిన్‌తో భయం లేదు!
పెరుగుతున్న కొత్తరకం కరోనా (New Coronavirus) కేసుల మధ్య ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆందోళనకు గురిచేస్తోంది. ఈ నెల 6 నుంచి బ్రిటన్ (UK)కు విమాన సర్వీసులు ప్రారంభించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే యూకే నుంచి 8 నుంచి భారత్‌కు విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఆర్టీపీసీఆర్ టెస్ట్ సర్టిఫికెట్ ఉంటేనే ప్రయాణానికి అనుమతించనున్నారు. అయితే ఇప్పటికే యూకే నుంచి వచ్చిన వందలాది మందిలో కరోనావైరస్ నిర్థారణ అయింది.
India Covid-19: దేశంలో తగ్గుముఖం పడుతున్న కరోనా కేసులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook