కోవిడ్ 19 వైరస్ ( Covid19 virus ) దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కరోనా వైరస్ సంక్రమణ విషయంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ( Central Health Minister ) చేసిన తాజా ప్రకటన ఇప్పుడు చర్చనీయాంశమైంది. అదే నిజమైతే అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేనట్టే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


భారతదేశంలో కరోనా వైరస్ సంక్రమణ ఇప్పుడు ఆందోళన కల్గిస్తోంది. ఇప్పటికి దేశంలో 7 లక్షల 67 వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా..రోజుకు 20-25 వేల కేసులు వెలుగుచూస్తున్నాయి. ఈ నేపధ్యంలో సర్వత్రా ఆందోళన నెలకొంది. కరోనా వైరస్ సంక్రమణ కమ్యూనిటీ స్టేజ్ ( Community transmission ) లో ప్రవేశించడం వల్లనే ఈ పరిస్థితి తలెత్తిందనే వాదన కూడా ప్రారంభమైంది. అయితే ఈ క్రమంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఇదే నిజమైతే కరోనా వైరస్ ( Corona virus ) విషయంలో అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం  లేదంటున్నారు విశ్లేషకులు. భారతదేశంలో కరోనా వైరస్ ఇంకా కమ్యూనిటీ స్డేజ్ కు చేరుకోలేదని కేంద్ర మంత్రి హర్షవర్షన్ Central Minister Harshavardhan ) ప్రకటించారు. కోవిడ్ 19 పరిస్థితిపై వివిధ శాఖల మంత్రులతో సమీక్ష నిర్వహించిన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్షన్ ఈ ప్రకటన చేశారు. కొన్ని ప్రత్యేక మైన ప్రాంతాల్లో సంక్రమణ వేగంగా ఉందని కానీ మొత్తం దేశంలో మాత్రం కరోనా వైరస్ ఇంకా కమ్యూనిటీ స్డేజ్ ( Community stage ) కు చేరలేదని స్పష్టం చేశారు. ప్రతి పదిలక్షల మందికి కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఇండియాలో 538 ఉండగా...ప్రపంచంలో అది సరాసరిన 1453 ఉందని ఆయన చెప్పారు. దేశంలో పరిస్థితి నియంత్రణలో ఉందని మంత్రి హర్షవర్షన్ చెప్పారు. ఇండియాలో కరోనా వైరస్ సంక్రమణ మూడో స్టేజ్ కు చేరిందంటూ వస్తున్న మీడియా వార్తల్ని ఆయన ఖండించారు. Also read: Remdesivir: ఆకాశాన్నంటుతున్న కరోనా మందు ధర


గత 24 గంటల్లో భారత్ లో 24 వేల 879 కరోనా కేసులు నమోదయ్యాయి. అటు 487 మంది మృత్యువాత పడ్డారు. మొత్తం 7 లక్షల 67 వేల కేసుల్లో ఇప్పటివరకూ 4 లక్షల 76 వేల మంది కోలుకుని డిశ్చార్చ్ అయ్యారని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి వెల్లడించారు. ప్రస్తుతం ఇండియాలో 2 లక్షల 69 వేల కేసులే యాక్టివ్ గా ఉన్నాయన్నారు. రికవరీ రేటు ఇండియాలో 61.53 శాతానికి పెరగడం గమనించాలన్నారు.  జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..