న్యూ ఢిల్లీ: భారత్‌లో గత 24 గంటల్లో 1,490 మందికి కరోనా వైరస్ సోకినట్టుగా కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. అదే సమయంలో కరోనా కారణంగా 56 మంది మృతి చెందినట్టు కేంద్రం వెల్లడించింది. దీంతో దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 24,942కి చేరగా.. మృతుల సంఖ్య 779కి చేరింది. శనివారం సాయంత్రం 5 గంటల వరకు ఉన్న అప్‌డేట్స్ ప్రకారం ఇండియాలో ప్రస్తుతం 18,953 యాక్టివ్ కేసులు ఉండగా 5,209 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also read : లాక్ డౌన్ తర్వాత ఈ మెట్రోలో ఇవి తప్పనిసరి


కరోనా ప్రభావం అధికంగా ఉన్న రాష్ట్రాల్లో ఒకటైన తమిళనాడులో నేడు 66 పాజిటివ్ కేసులు వెలుగుచూడగా ఒకరు మృతి చెందారు. నేటితో తమిళనాడులో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,821కి చేరగా మృతుల సంఖ్య 23కిచేరింది. తమిళనాడులో ఇప్పటివరకు 960 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇది మొత్తం కరోనా పాజిటివ్ కేసులలో 52 శాతం. 


Also read : COVID-19: తెలంగాణలో కోవిడ్ నివారణపై కేంద్రం ఆరా


మధ్యప్రదేశ్‌లోనూ కరోనా వైరస్ మృత్యుతాండవం చేస్తోంది. ఇప్పటివరకు మధ్యప్రదేశ్‌లో 1945 కరోనా కేసులు బయటపడగా.. 99 మంది చనిపోయారు. ఒక్క ఇండోర్‌లోనే 1085 మందికి కరోనా సోకగా.. 57 మంది చనిపోయారు. రాజధాని భోపాల్‌లోనూ కరోనా ప్రభావం ఎక్కువే ఉంది. మొత్తం 388 మందికి కరోనా సోకగా.. అందులో 9 మంది కరోనా కాటుకు బలయ్యారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..