లాక్ డౌన్ తర్వాత ఈ మెట్రోలో ఇవి తప్పనిసరి

లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని ఆలోచనలో పడిన ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్.. లాక్ డౌన్ తర్వాత మెట్రో రైలు ఎక్కే ప్రయాణికులు ఫేస్ మాస్క్ ధరించడంతో పాటు, వారి మొబైల్లో ఆరోగ్య సేతు యాప్ తప్పనిసరిగా ఉండాలనే నిబంధన విధించేందుకు సిద్ధమైంది.

Last Updated : Apr 25, 2020, 06:35 PM IST
లాక్ డౌన్ తర్వాత ఈ మెట్రోలో ఇవి తప్పనిసరి

న్యూ ఢిల్లీ: లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని ఆలోచనలో పడిన ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్.. లాక్ డౌన్ తర్వాత మెట్రో రైలు ఎక్కే ప్రయాణికులు ఫేస్ మాస్క్ ధరించడంతో పాటు, వారి మొబైల్లో ఆరోగ్య సేతు యాప్ తప్పనిసరిగా ఉండాలనే నిబంధన విధించేందుకు సిద్ధమైంది. ఢిల్లీలో మెట్రో రైళ్లలో నిత్యం 30 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ నియంత్రణ విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా.. ఆ తర్వాత జరిగే పరిణామాలు ఊహించడం కష్టమే. అందుకే ముందు జాగ్రత్త చర్యగా 12 వేల మంది సీఆర్పీఎఫ్ బలగాలతో అన్ని మెట్రో స్టేషన్స్ వద్ద కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టనున్నట్టు ఢిల్లీ మెట్రో రైలు అధికారులు చెబుతున్నారు.

Also read : లాక్ డౌన్ పరిమితి సడలింపు..!!

మెట్రో స్టేషన్‌లోకి వచ్చే ప్రయాణికులు వచ్చినట్టే లగేజీ తనిఖీ చేసే చోటే ఫేస్ మాస్క్, ఆరోగ్య సేతు మొబైల్ యాప్ కూడా తనిఖీ చేయనున్నారు. ఇవే కాకుండా థర్మల్ స్క్రీనింగ్ సైతం ఉండనుంది. ఎవరైనా అధిక ఉష్ణోగ్రతలు కలిగి ఉంటే.. వారిని మెట్రోలోకి అనుమతించరు. అలాగే ఎవరికైనా ఫ్లూ లక్షణాలు ఉంటే.. వారిని కూడా మెట్రో స్టేషన్‌లోకి అనుమతించకుండా ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ అధికారులు చర్యలు తీసుకోబోతున్నారు. 

Also read : ఉత్తరప్రదేశ్‌లో మరో కఠిన నిర్ణయం..!!

భారత్‌లో లాక్ డౌన్ ప్రారంభమై ఏప్రిల్ 24తో నెల రోజులు పూర్తయింది. ఈ నేపథ్యంలో హాట్‌స్పాట్ ప్రాంతాలు మినహాయించి కరోనా ప్రభావం అంతగా లేని ప్రాంతాల్లో వ్యాపారాలు చేసుకునేలా షరతులతో కూడిన అనుమతులు ఇస్తూ కేంద్రం సైతం ఆదేశాలు జారీచేసిన సంగతి తెలిసిందే. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News