Covid-19 Positive Cases: ఇండియాలో మరోసారి 50వేల పైగా కరోనా పాజిటివ్ కేసులు
Covid-19 Positive Cases: ఇండియాలో జనవరిలో వ్యాక్సినేషన్ ప్రారంభించనప్పటి నుంచి మొత్తం 30 కోట్ల 79 లక్షల 48 వేల 744) కోవిడ్19 వ్యాక్సిన్ డోసులు ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ శుక్రవారం ఉదయం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
Covid-19 Positive Cases: ఇండియాలో మరోసారి 50 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశ వ్యాప్తంగా గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం 8 గంటల వరకు 51,667 మంది కరోనా బారిన పడ్డారు. వీటితో కలిపితే దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 3,01,34,445కు (30 కోట్ల 1 లక్షా 34 వేల 445)కు చేరుకుంది.
అదే సమయంలో దేశ్యాప్తంగా కరోనాతో పోరాడుతూ 1,329 మంది మరణించారు. దేశంలో కరోనా మరణాల సంఖ్య 3,93,310 (3 లక్షల 93 వేల 310)కి పెరిగింది. దేశంలో ప్రస్తుతం 6,12,868 యాక్టివ్ కేసులున్నాయి. జనవరి నుంచి ఇప్పటివరకు దేశంలో 30.79 కోట్ల మందికి వ్యాక్సినేషన్ చేశారు. మొత్తం 30,79,48,744 (30 కోట్ల 79 లక్షల 48 వేల 744) కోవిడ్19 వ్యాక్సిన్ (COVID-19 Vaccine) డోసులు ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ శుక్రవారం ఉదయం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
Also Read: Medical Posts 2021: మెడికల్ కాలేజీలకు 7007 పోస్టులు మంజూరు చేసిన తెలంగాణ ప్రభుత్వం
ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టినట్లే కనిపించినా, వరుసగా మూడోరోజు 50 వేలకు పైగా కోవిడ్19 కేసులు నమోదు కావడం గమనార్హం. మరోవైపు కొన్ని రాష్ట్రాలు కర్ఫ్యూ వేళలను కుదించడం, కొన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్ సడటించడంతో కరోనా వ్యాప్తి పెరిగిపోయే (COVID-19 New Wave) అవకాశం ఉందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నిన్న ఒక్కరోజులో 64,527 మంది కరోనా మహమ్మారిని జయించారు. ఇండియాలో ఇప్పటివరకూ 2 కోట్ల 91 లక్షల 29వేల 267 మంది కోవిడ్19ను జయించారు.
Also Read: COVID-19 Delta Variant: 85 దేశాల్లో డెల్టా వేరియంట్ కేసులు నమోదు, WHO వార్నింగ్
దేశంలో యాక్టివ్ కేసులు మరోసారి దిగొచ్చాయి. ప్రస్తుతం 6,12,868 యాక్టివ్ కోవిడ్-19 కేసులున్నాయి. భారత్‌లో కరోనా రికవరీ రేటు భారీగా పెరిగింది. నిన్న ఒక్కరోజు 17 లక్షల 35 వేల 781 శాంపిల్స్‌కు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) తాజా హెల్త్ బులెటిన్‌లో తెలిపింది. ఓవరాల్‌గా దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 39,95,68,448 (39 కోట్ల 95 లక్షల 68 వేల 448) శాంపిల్స్‌కు కోవిడ్19 పరీక్షలు నిర్వహించారు.
Also Read: Covaxin License: కోవాగ్జిన్‌కు పూర్తి స్థాయి లైసెన్స్ ఇచ్చేందుకు నిరాకరించిన డీసీజీఐ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook