Medical Posts 2021: మెడికల్ కాలేజీలకు 7007 పోస్టులు మంజూరు చేసిన తెలంగాణ ప్రభుత్వం

Telangana Medical Posts 2021: నాగర్‌కర్నూలు, వనపర్తి, కొత్తగూడెం, మంచిర్యాల, మహబూబాబాద్, సంగారెడ్డి, జగిత్యాలలో మెడికల్ కాలేజీల ఏర్పాట్లు తెలంగాణ ప్రభుత్వం ఇటీవల అనుమతి ఇచ్చింది. ఈ ఏడు కాలేజీలకు పోస్టులు మంజూరు చేయడం గమనార్హం.

Written by - Shankar Dukanam | Last Updated : Jun 24, 2021, 05:44 PM IST
Medical Posts 2021: మెడికల్ కాలేజీలకు 7007 పోస్టులు మంజూరు చేసిన తెలంగాణ ప్రభుత్వం

Medical Posts 2021: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఉమ్మడి ఏపీలో ఈ ప్రాంతంలో కేవలం 4 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉండేవి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాడ్డాక టీఆర్ఎస్ ప్రభుత్వం ఇదివరకే 5 కొత్త మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసింది. ఇటీవల మరో 7 మెడికల్ కాలేజీల నిర్మాణానికి అనుమతి ఇవ్వడం తెలిసిందే.

నాగర్‌కర్నూలు, వనపర్తి, కొత్తగూడెం, మంచిర్యాల, మహబూబాబాద్, సంగారెడ్డి, జగిత్యాలలో మెడికల్ కాలేజీల ఏర్పాట్లు తెలంగాణ ప్రభుత్వం ఇటీవల అనుమతి ఇచ్చింది. ఈ ఏడు కాలేజీలకు ఒక్కో కాలేజీ చొప్పున 1001 పోస్టులు మంజూరు చేయడం గమనార్హం. మొత్తం 7 కాలేజీలకు కలిపి 7007 మెడికల్ పోస్టులు రానున్నాయి. ప్రొఫెసర్, డాక్టర్, టెక్నీషియన్, ఫార్మసిస్ట్ మరియు ఇతరత్రా పోస్టులు ఇందులో ఉంటాయి. మరోవైపు కొత్త నర్సింగ్ కాలేజీలకు సైతం పోస్టులు లభించాయి. ఒక్క కాలేజీకి 48 చొప్పున 13 కొత్త నర్సింగ్ కాలేజీలకు, పాతవైన గాంధీ నర్సింగ్ కాలేజీ, జగిత్యాల కాలేజీలకు కలిపి మొత్తం 720 పోస్టులను Telangana సర్కారు మంజూరు చేసింది.

Also Read: Indian Railways: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్ 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News