Karnataka students COVID-19 positive: కరోనా కొత్త వేరియంట్  ఒమిక్రాన్ కేసులు ఇప్పటికే కర్ణాటకలో బయటపడ్డాయి. ఒక పక్క ఒమిక్రాన్ భయాలు వెంటాడుతున్న వేళ...ఆ రాష్ట్రంలోని పలు విద్యాసంస్థల్లో భారీ సంఖ్యలో కొవిడ్ కేసులు(karnataka covid-19 cases) నమోదవుతున్నాయి. దీంతో తల్లిదండ్రులు, విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఏడు వేలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో..ఇది కరోనా థర్డ్ వేవ్(covid-19 third wave)కు సంకేతమా అని అనుమానం కలుగుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గత 24 గంటల్లో ఆ రాష్ట్రంలోని శివమెుగ్గ, చిక్‌మగళూరు జిల్లా(Chikkamagalur district)లోని 68 మంది విద్యార్థులకు కొవిడ్ పాజిటివ్(Karnataka students COVID-19 positive)గా నిర్ధారణ అయ్యింది. చిక్‌మగళూరు జిల్లా సీగోడు గ్రామంలోని జవహర్‌ నవోదయ విద్యాలయంలో 40కిపైగా విద్యార్థులకు వైరస్ సోకినట్లు తేలింది. 


Also Read: Karimnagar: కరీంనగర్‌లో కరోనా కలకలం.. 39 మంది వైద్య విద్యార్థులకు పాజిటివ్


దీంతోపాటు శివమొగ్గ(Shivamogga)లోని ఓ ప్రైవేటు నర్సింగ్‌ కళాశాలలో 29 మంది విద్యార్థులకు కొవిడ్‌ పాజిటివ్‌గా వెల్లడైంది. వారిలో చాలా మందికి లక్షణాలు లేవని స్థానిక డిప్యూటీ కమిషనర్‌ కేబీ శివకుమార్‌ తెలిపారు. దీంతో ఈ ప్రాంతాలను క్లస్టర్‌లుగా ప్రకటించి, హాస్టళ్లను మూసివేసినట్లు అధికారులు తెలిపారు. పరిసరాల్లో ఎవరికైనా వ్యాప్తి చెందిందా నిర్ధారించేందుకుగానూ.. స్థానికుల నమూనాలనూ పరీక్షిస్తున్నట్లు చెప్పారు. కర్ణాటక ప్రభుత్వం విద్యార్థులకు ర్యాండమ్‌గా నిర్వహిస్తున్న కొవిడ్‌ పరీక్షల్లో పెద్దఎత్తున కేసులు వెలుగుచూస్తున్నాయి.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook